Begin typing your search above and press return to search.
నాని చేతులు దాటి పోయిందా?
By: Tupaki Desk | 5 Aug 2021 3:10 AM GMTకరోనా కారణంగా సినిమా పరిశ్రమ బాగా ఎఫెక్ట్ అవుతుంది. థియేటర్లు ఓపెన్ లేక పోవడంతో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు థియేటర్లు ఓపెన్ అయ్యాయి. కాని జనాలు థియేటర్ల వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా అనిపించడం లేదు. గత వారం విడుదల అయిన తిమ్మరుసు కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా జనాలు మాత్రం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. గత వారం విడుదల అయిన సినిమాలకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. సరే వీకెండ్ లో అయినా సినిమా ను జనాలు చూస్తారేమో అనుకుంటే.. అప్పుడు కూడా నిరాశే తప్పలేదు.
జనాలు థియేటర్లకు వచ్చేందుకు ఇంకా కూడా భయపడుతున్నారని.. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎప్పటికి వస్తారు అనేది క్లారిటీ లేదు. కరోనా భయం ఉన్నంత కాలం థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించడం కష్టమే అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలోనే పలు సినిమాలు ఓటీటీ దారి పడుతున్నాయి. కొందరు హీరోలు పట్టుబట్టి తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయకుండా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని కొందరు హీరోలు మాత్రం నిర్మాతల పరిస్థితి అర్థం చేసుకుని ఓటీటీ రిలీజ్ కు తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే చెప్పాల్సి వస్తుంది. గత ఏడాది నాని 25వ సినిమా వి ఓటీటీలో విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆయన నటించిన టక్ జగదీష్ సినిమా ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు.
నాని కూడా ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమా ను థియేటర్లలోనే విడుదల చేయాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. థియేటర్ అనేది మన సంస్కృతిలో భాగం అంటూ ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టి టక్ జగదీష్ ఖచ్చితంగా థియేటర్ రిలీజ్ ఉంటుందని అంతా భావించారు. ఈ సినిమాకు ఓటీటీ వారు పెద్ద పెద్ద అమౌంట్స్ ఆఫర్ చేస్తున్నా కూడా ఇన్నాళ్లు నాని వారిని కాస్త ఒప్పించి మెప్పించి థియేటర్ రిలీజ్ కోసం వేచి చూసేలా చేశాడు. కాని ఇప్పటి పరిస్థితి థియేటర్లలో విడుదల అయినా కూడా జనాలు వచ్చేలా లేరని మేకర్స్ భావిస్తున్నారట. దాంతో సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడం బెటర్ అనే నిర్ణయానికి వారు వచ్చారని.. ఇన్నాళ్లు వారిని వారించిన నాని ఇప్పుడు ఇక చేతులు ఎత్తేసినట్లుగా తెలుస్తోంది.
నిర్మాతలు ఆర్థికంగా మరీ అధిక భారం ను మోయడం సబబు కాదనే ఉద్దేశ్యంతో నాని కూడా ఇక మీ ఇష్టం అన్నట్లుగా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా ను ప్రముఖ ఓటీటీ పెద్ద మొత్తంకు తీసుకునేందుకు సిద్దంగా ఉంది. పలు ఓటీటీ లు చర్చలు జరుపుతున్నాయి. అతి త్వరలోనే ఏదో ఒక ఓటీటీలో ఈ విషయమై ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. నాని అభిమానులు జగదీష్ ను థియేటర్ లో ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మేకర్స్ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో అభిమానుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
శివ నిర్వాన ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా పాజిటివ్ టాక్ ను దక్కించుకోవడం ఖాయం.. భారీ వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో జగదీష్ ను ఓటీటీ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల వారిలో కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది.