Begin typing your search above and press return to search.

ఫేక్ సీన్ తో సామ్ ని సర్ప్రైజ్ చేసిన విజయ్..!

By:  Tupaki Desk   |   28 April 2022 1:46 PM GMT
ఫేక్ సీన్ తో సామ్ ని సర్ప్రైజ్ చేసిన విజయ్..!
X
యువ హీరో విజయ్‌ దేవరకొండ - సీనియర్ హీరోయిన్ సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. #VD11 అనే వర్కింగ్‌ టైటిల్‌ తో ఇటీవలే ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది. విజయ్ - సమంత పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇవాళ (ఏప్రిల్ 28) సామ్ బర్త్ డే కావడంతో #VD11 టీమ్ ఆమెకు సర్ప్రైజ్ తో కూడిన స్పెషల్ విషెస్ అందజేశారు.

సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు తెలియకుండా బుధవారం మిడ్ నైట్ చిత్ర బృందం ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. దర్శకుడు శివ నిర్వాణ ఓ ఫేక్ సీన్ ని రాసుకుని సామ్ తో రిహార్షల్ చేయించారు. వీడీ కూడా ఇది నిజమే అన్నట్లు సామ్ ని నమ్మించారు.

దర్శకుడు యాక్షన్ చెప్పగానే సామ్ - విజయ్ నటించడం మొదలు పెట్టారు. 'పది రోజుల్లో వచ్చేస్తాను.. నువ్వు మా పేరెంట్స్ తో మాట్లాడటం కాదు.. నేనే మీ వాళ్ళతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తా..' అని సమంత సీన్ లో లీనమై డైలాగ్ చెబుతోంది.

అయితే విజయ్ ఆమె చెంపలను తాకుతూ 'సమంత' అని డైలాగ్ చెప్పడం మొదలు పెట్టగానే సామ్ పెద్దగా నువ్వేసింది. వెంటనే వీడీ తో పాటుగా మిగతా టీమ్ అంత హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ చేశారు.

అర్థరాత్రి ఇదంతా ఊహించని సమంత షాక్ అయింది. #VD11 టీమ్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ కి ఉబ్బితబ్బిబ్బయింది. ఎమోషనల్ అవుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియోని మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది.

ఇకపోతే విజయ్ - సమంత కలిసి ఇంతకముందు 'మ‌హాన‌టి' చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత‌ మ‌రోసారి ఈ జోడి వెండితెర‌పై క‌నువిందు చేయబోతోంది. ఇది కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే అందమైన ప్రేమకథ అని తెలుస్తోంది. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్ తో పాటు స‌చిన్ ఖేడ్క‌ర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు. 'డియర్ కామ్రేడ్' తర్వాత మైత్రీ బ్యానర్ లో విజయ్ నటిస్తున్న రెండో సినిమా ఇది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్, 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.