Begin typing your search above and press return to search.
స్టార్ హీరో కోసం టీమ్ నిరీక్షణ.!
By: Tupaki Desk | 11 Nov 2022 2:30 AM GMTగతంలో ఎదురు దెబ్బలు తిన్న స్టార్ ప్రొడ్యూసర్ ఆయన. ఒక దశలో తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ లని అందించారు. ఆ తరువాత భారీ నష్టాలు రావడంతో సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ అజిత్ చేసిన సహాయంతో సక్సెస్ బాట పట్టి వరుస విజయాలతో ట్రాక్ లోకి వచ్చారు ఆయనే స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం. ప్రస్తుతం ఆయన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పీరియాడిక్ మూవీ `హరి హర వీరమల్లు`ని నిర్మిస్తున్నారు. కరోనా కు ముందు మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఆగుతూ సాగుతూనే వుంది.
క్రిష్ జాగర్లమూడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్య కాలం నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే గజదొంగగా ఇందులో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఉన్నవాడిని కొట్టు లేని వాడికి పెట్టు అనే సిద్ధాంతాన్ని నమ్మే రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా ఇది. రాజకీయాల కారణంగా మూడున్నరేళ్ల విరామం తరువాత కెమెరా ముందుకొచ్చిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా ఈ మూవీ షూటింగ్ ని నిత్యం వాయిదా వేస్తూనే వున్నారు.
ఇటీవల తదుపరి షెడ్యూల్ కోసం నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న పవన్ కల్యాణ్ అన్నట్టుగానే రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టాడు. కానీ మళ్లీ మధ్యలోనే ఆపేసి జనసేన పార్టీ పనుల్లో బిజీ అయిపోయారు. వైజాగ్, ఇప్పటం వంటి ప్రదేశాల్లో పర్యటిస్తున్న పవన్ `హరి హర వీరమల్లు`ని మళ్లీ హోల్డ్ లో పెట్టేశారు. ఇక నుంచి కంటిన్యూగా షూటింగ్ జరుగుతుందని భావించిన చిత్ర బృందం రామోజీ ఫిల్మ్ సిటీలో సిబ్బందికి కాటేజీలు లీజుకు తీసుకుందట.
అంతే కాకుండా నాన్ స్టాప్ షెడ్యూల్ లో సినిమాని పూర్తి చేయాలని ఫిక్స్ అయిన చిత్ర బృందం అక్కడే భారీ సెట్ లని నిర్మించి షూటింగ్ ని మొదలు పెట్టింది. కానీ పవన్ మధ్య, మధ్యలో షూటింగ్ కి గ్యాప్ లు ఇస్తుండటంతో నిర్మాత ఏ.ఎం. రత్నం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల షూటింగ్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టి వెంటనే బ్రేకిచ్చారు. పవన్ సెట్ లోకి అడుగు పెడితే కానీ మళ్లీ షూట్ మొదలవ్వదు.
కానీ పవన్ మాత్రం ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో తెలియని పరిస్థితి.. దీంతో హరి హర టీమ్ కు పవన్ కోసం ఎదురు చూపులు తప్పడం లేదట. పంన్ ఎప్పటికి కరుణించేనో `హరి హర వీరమల్లు` ఎప్పటికి పూర్తయ్యేనో అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా పవన్ ఈ మూవీని సీరియస్ గా పూర్తి చేసేనా .. అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.