Begin typing your search above and press return to search.
టీజర్: ఇంట్రెస్టింగ్ గా అమలాపాల్ సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ 'కుడి ఎడమైతే'
By: Tupaki Desk | 3 July 2021 5:51 AM GMTతెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' ఇటీవల ''కుడి ఎడమైతే'' అనే సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. అమలాపాల్ - రాహుల్ విజయ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'లూసియా''యూ టర్న్' ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ని రామ్ విఘ్నేశ్ రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేయబడిన ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మోషన్ పోస్టర్ ఆసక్తిని కలిగించింది. జూలై 16 నుండి 'కుడి ఎడమైతే' సిరీస్ ను స్ట్రీమింగ్ కు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపించిందా?' అనే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఇందులో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్ గా.. రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపిస్తున్నారు. భిన్నమైన రంగాలకు చెందిన ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాలను ప్యారలాల్ గా చూపిస్తూ ఓ యాక్సిడెంట్ కి గురైనట్లు టీజర్ లో చూపించారు. రవి ప్రకాష్ కీలక పాత్రలో నటించాడు. ఇది ఎమోషన్స్ - థ్రిల్స్ కలబోసిన టైం లూప్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. ఆధ్యంతం ఆసక్తికరంగా థ్రిల్లింగ్ గా సాగిన ''కుడి ఎడమైతే'' టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
అయితే ఇందులో అమలా పాల్ - రాహుల్ విజయ్ కథేంటి? ఇందులోకి సైంటిఫిక్ అంశాలు ఎలా వచ్చాయి? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఇది ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారం కానున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని తెలుస్తోంది. ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ తో 'ద్విత్వ' అనే పాన్ సౌత్ ఇండియా మూవీ చేస్తున్న టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ కుమార్.. ఈ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ''కుడి ఎడమైతే'' సిరీస్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.