Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: ఆడది కనిపిస్తే కమిట్ మెంటేనా.. ఇంకేదీ ఆలోచించరా?
By: Tupaki Desk | 18 Nov 2020 6:15 AM GMTఆడది కనిపిస్తే మృగాళ్లు ఇంతేనా? కాంప్రమైజ్ అవ్వాలి... లేదంటే కమిట్ మెంట్ ఇవ్వాలి? ఇంతేనా.. ఇంకేదీ ఆలోచించరా? ఈ ఒక్క డైలాగ్ లోనే మొత్తం సినిమా కథ తెలిసిపోతోంది. మీటూ పర్యవసానంతో కమిట్ మెంట్ అంటే ఏమిటో కాంప్రమైజ్ అంటే ఏమిటో బయటి ప్రపంచానికి పూర్తిగా తెలిసొచ్చింది. లైఫంటే సెక్సేనా...? జన్మనిచ్చేది అదే అయితే అడిగితే తప్పేంటి? అనే అర్థంలో సంభాషణలతో అసలు మ్యాటర్ లోకి వచ్చేసారు.
వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ప్రతిచోటా ఉన్నా.. సినీపరిశ్రమలో ఇలాంటివి సర్వసాధారణం అన్న భావన బలపడిపోయింది. అయితే ఇక్కడ కమిట్ మెంట్ అనేది కేవలం సినీపరిశ్రమకే కాదు.. అన్ని రంగాల్లోనూ ఉంటుందని చెప్పేందుకు డాక్టర్ల కమిట్ మెంట్ ఎపిసోడ్ ని జోడించినట్టు ఈ టీజర్ చెబుతోంది.
ఆడది ఎక్కడ ఉన్నా కమిట్ మెంట్ అడిగేవాళ్లు ఉంటారనేది కామన్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది. అసలు ఆడది అంటేనే కాంప్రమైజ్ కమిట్ మెంటా ఇంకే ఆలోచనా ఉండదా? అంటూ తేజస్వి మాదివాడ ఎమోషనల్ డైలాగ్ చెవుల్లో రింగుమంటోంది. ఆ ఒక్క పాత్రతో బోలెడంత ఎమోషన్ పెంచేశారు దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా.
బర్నింగ్ టాపిక్ ని కరెంట్ ఎలిమెంట్ ని ఉపయోగించి ఈ సినిమాని తెరకెక్కించారని అర్థమవుతోంది. కమిట్ మెంట్ అనే ఒక్క అంశం ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీప్రముఖుల్ని జైళ్ల పాలు చేస్తోంది. హార్వే వీన్ స్టీన్ అంతటి వాడికే చెమటలు పట్టించేసింది. జైళ్లలో పోరాడుతూ రోగాలతో చావు ముందుకు వచ్చాడు వీన్ స్టీన్. గొప్పగా బతికి అధోఃగతి పాలయ్యాడు అతడు. బాలీవుడ్ లో ఎందరో దిగ్గజాలకు ఆఫర్లు లేకుండా పోయాయి. అయితే వీటిలో మెజారిటీ భాగం తేలిపోయిన కేసులు కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి ఎన్నో ఎలిమెంట్స్ ని మహిళా ప్రేక్షకులు ఆశిస్తారు. నలుగురమ్మాయిల కమిట్ మెంట్ ఏ రేంజులో ఉందో లక్ష్మీ కాంత్ చెన్నా ఏ రేంజులో చూపించబోతున్నారో మచ్చుకి టీజర్ చెప్పేస్తోంది. 2018 ఎండింగ్ నుంచి 2019-20 సీజన్ లో ఎక్కువగా చర్చించుకున్న ఎలిమెంట్ కమిట్ మెంట్.. అందుకే ఈ మూవీ ఎలా ఉండనుందో చూడాలన్న ఉత్సుకత జనంలో ఉంది. ట్రైలర్ అలాగే మూవీ ఏ రేంజులో వెండితెరను వేడెక్కించనున్నాయో చూడాలని యూత్ ఉత్సాహంగానే ఉన్నారు మరి.