Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ : కొన్ని ర‌హ‌స్యాల్ని ఎప్ప‌టికీ పూడ్చి పెట్ట‌లేరు!

By:  Tupaki Desk   |   29 Sep 2022 10:04 AM GMT
టీజ‌ర్ టాక్ : కొన్ని ర‌హ‌స్యాల్ని ఎప్ప‌టికీ పూడ్చి పెట్ట‌లేరు!
X
మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌, మీనా జంట‌గా రూపొందిన 'దృశ్యం' సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేప‌సుకున్న విష‌యం తెలిసిందే. ఇదే మూవీని ఇత‌ర భాష‌ల్లో రీమేక్ చేస్తే అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకుంది.

ఆ త‌రువాత దీనికి సీక్వెల్ గా 'దృశ్యం 2'ని అదే జంటతో రూపొందించారు. ఇది కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ రీమేక్ చేశారు. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించింది.

తాజాగా ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. 'దృశ్యం' రీమేక్ లో న‌టించిన అజ‌య్ దేవ‌గ‌న్‌, శ్రియా పార్ట్ 2లోనూ జంట‌గా న‌టించారు. గ‌త కొన్ని నెల‌లుగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఈ మూవీ టీజ‌ర్ ని గుర‌వారం హీరో అజ‌య్ దేవ్ గ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. విజ‌య్, అత‌ని కుటుంబ క‌థ మీకు గుర్తుంది క‌దూ..? మ‌ళ్లీ గుర్తు చేయాలా? .. అంటూ టీజ‌ర్ ని విడుద‌ల చేశాడు అజ‌య్ దేవ్‌గ‌న్‌. అభిషేక్ పాఠ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

టాబు, అక్ష‌య్ ఖ‌న్నా, ఇషితా ద‌త్తా, ర‌జ‌త్ క‌పూర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. టీజ‌ర్ రిలీజ్ తో పాటు హీరో అజ‌య్ దేవ‌గ‌న్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించేశాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీని ఈ ఏడాది న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. 'స‌మీర్ దేశ్ ముఖ్‌.. మీరా దేశ్ ముఖ్ ఒక్క‌గానొక్క కొడుకు.. గ‌త మూడు నెల‌లుగా క‌నిపించ‌డం లేదు.. అనే వాయిస్ తో టీజ‌ర్ మొద‌లైంది.

మ‌ల‌యాళ మాతృక‌ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ తెలుగులో దించేస్తే.. హిందీలోనూ అదే ప‌ని చేశారు. అయితే ఇందులో చిన్న పాప పాత్రి మ‌రింత ఏజ్ త‌గ్గించి చూపించారు. ఇక మ‌గ‌తా స‌న్నివేశాలు పాత్ర‌లు అన్నీ సేమ్ టూ సేమ్‌.. అదే ఇంటెన్స్ తో న‌డిపించిన‌ట్టుగా తెలుస్తోంది.

మ‌రో సారి శ్రియ‌, అజ‌య్ దేవ్ గ‌న్, ట‌బు ఈ మూవీతో మ్యాజిక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. టీజ‌ర్ లో కొన్ని ర‌హ‌స్యాల్ని ఎప్ప‌టికీ పూడ్చి పెట్ట‌లేరు అంటూ వేసిన టైటిల్స్, టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.