Begin typing your search above and press return to search.
టీజర్ టాక్ : లా పతా లేడీస్.. భార్యల కోసం భర్తల వేట!
By: Tupaki Desk | 10 Aug 2022 9:30 AM GMTబాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన మూవీ 'లా పతా లేడీస్'. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సమర్పణలో అమీర్ ఖాన్, కిరణ్ రావు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. నితాన్షీ గోయెల్, ప్రతిభా రత్న, స్పర్ష్ శ్రీవాస్తవ్, ఛాయా కదమ్, రవికిషన్ ప్రధాన పాత్రలలో నటించారు. కొత్తగా పెళ్లైన ఓ జంట జర్నీ నేపథ్యంలో ఈ మూవీని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. బుధవారం ఈ మూవీ టీజర్ ని విడుదల చేశారు.
2001 నేపథ్యంలో సాగే కథగా ఈ మూవీని రూపొందించారు. మూడు రోజుల క్రితం ఇద్దరు యువకులు పెద్దలు కుదిరచ్చిన వివాహం చేసుకుంటారు. తిరిగి సొంతూరికి పయనమైన క్రమంలో ట్రైన్ లో ఇద్దరు యువకుల భార్యలు తప్పిపోతాకరు.
దీంతో ఇద్దరు భర్తలు తప్పిపోయిన తమ భార్యల కోసం పోలిస్ స్టేషన్ కి వెళతారు. అక్కడ వారి భార్యల గురించి వివరించి కంప్లైంట్ ఇస్తారు. అయితే ఇక్కడే ట్విస్ట్ పోలీసులకు వారి భార్యలకు సంబంధించిన ఆచూకీ కోసం ఇచ్చిన ఫొటోల్లో వారి ముఖాలు కనిపించవు.
దీంతో స్వయంగా వారే అన్వేషణ మొదలు పెడతారు. రవికిషన్ మిస్సింగ్ కేసుని నమోదు చేసుకునే పోలీస్ ఆఫీసర్ గా కనిపించి సీరియస్ డైలాగ్ లతో నవ్వులు పూయిస్తున్నాడు. తప్పిపోయిన వధువుల ఆచూకీ పోలీసులకు కష్టతరంగా మారుతుంది.
ఈ క్రమంలో సాగే సన్నివేశాలు ఆద్యంతం వినోదాన్ని పంచేవిగా వున్నాయి. తన స్నేహితుడి భార్య పెళ్లైన మూడవ రోజే ట్రైన్ లో తప్పిపోయిందని ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్న సన్నివేశాలతో టీజర్ మొదలైంది.
నితాన్షీ గోయెల్, ప్రతిభా రత్న ఈ మూవీలో తప్పి పోయిన నూతన వధువులుగా నటించారు. వీరి ఆచూకీని వీరి భర్తలు కనిపెట్టారా? చివరికి ఏం జరిగింది అన్నదే ఈ చిత్ర ప్రధానం కథాంశం. వినోదాన్ని జోడించి ఈ మూవీని కిరణ్ రావు తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటోంది. 'థోబీ ఘాట్' తో దర్శకురాలిగా పలు అవార్డ్ లని ప్రశంసల్ని సొంతం చేసుకున్న కిరణ్ రావు మళ్లీ ఇన్నేళ్లకు 'లా పతా లేడీస్'ని తెరకెక్కించింది. బిప్లబ్ గోస్వామి కథ, స్నేహా దేశాయి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడా రామ్ సంపత్ సంగీతం అందించారు. 2023 మార్చి 3న ఈ మూవీని విడుదల కానుంది.