Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: స్టైల్ గా ఉంది కదా? నాక్కూడా నచ్చింది

By:  Tupaki Desk   |   11 Dec 2019 11:26 AM GMT
టీజర్ టాక్: స్టైల్ గా ఉంది కదా? నాక్కూడా నచ్చింది
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం 'అల వైకుంఠపురములో'. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం విడుదలయింది.

సచిన్ ఖేడెకర్ పాత్ర వాయిస్ ఓవర్ లో "మీ నాన్న పెళ్లికూతురును దాచినట్టు దాచాడు నిన్ను" అంటూ అల్లు అర్జున్ తో చెప్పే డైలాగ్ తో టీజర్ ఆరంభమయింది. అటు డైలాగ్ వాయిస్ ఓవర్ లో వస్తుంటే ఇటు స్టైలిష్ స్టార్ 'రౌడీ అల్లుడు' తరహాలో లిఫ్ట్ లో కనిపిస్తాడు.. రెడ్ కలర్ బ్లేజర్ ను స్టైల్ గా వేసుకుని ఓ పొడవాటి కాన్ఫరెన్స్ టేబుల్ పై అడ్డంగా నడుచుకుంటూ వస్తాడు. ఈ రౌడీ లాంటి నిర్వాకానికి శ్రీహర్ష.. సునీల్ లాంటి సాఫ్ట్ కార్పోరేట్ ఉద్యోగులు అవాక్కవుతూ ఉంటారు. ఇలాంటి రెండు మూడు కట్ షాట్స్ తర్వాత "గట్టోడివి" అంటూ ఖేడెకర్ బన్నీ భుజం తడతాడు. తర్వాత రెండు మూడు డిఫరెంట్ సీన్స్ లో ఫాస్ట్ కట్స్ లో రౌడీలను స్టైల్ గా చితక్కొడుతూ "స్టైల్ గా ఉంది కదా? నాక్కూడా నచ్చింది" అంటాడు. 'నాక్కూడా' అనే సమయం లో 'ద్యావుడా' స్టైల్ లో ఒక డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. మరో సీన్లో కుర్చీలో వాలిపోయి కూర్చుని నవదీప్.. రాహుల్ రామకృష్ణ తో "మేడమ్ సర్.. మేడం అంతే" అంటాడు.. ఇక్కడ కూడా సరిగ్గా బన్నీ-త్రివిక్రమ్ మార్క్ కనిపించింది.

ఓ అని సినిమానుంచి వరసబెట్టి పాటలు రిలీజ్ చేస్తూపోతున్నారు.. అనే దానికి సెటైర్ కూడా వేసుకున్నారు. సుశాంత్ "సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు" అంటాడు.. దానికి బదులుగా "అమ్మ.. ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక.. డైలాగు లే కదా?" అంటూ సెటైర్ వేసుకుని.. విలన్ సముద్రకని ఎంట్రీ చూపించారు. బన్నీ తన ఎక్స్ ప్రెషన్ తో సముద్రకనికి కౌంటర్ ఇస్తూనే "మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా" అంటూ పంచ్ వేస్తాడు. త్రివిక్రమ్ మార్క్.. బన్నీ స్టైల్ తో పాటు థమన్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. తక్కువ సేపే కనిపించినా పూజ తన గ్లామర్ మ్యాజిక్ చేసేసింది. టీజర్ అద్భుతం అని చెప్పలేం కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే టీజర్ లో కొన్ని సీన్స్ త్రివిక్రమ్ గత చిత్రాలను గుర్తు కు తెచ్చేలా ఉన్నాయి. ఆలస్యం ఎందుకు.. మాస్ స్టైలిష్ స్టార్ ను చూసేయండి.