Begin typing your search above and press return to search.

అల టీజర్ కు ముహూర్తం ఖరారు

By:  Tupaki Desk   |   9 Dec 2019 7:19 AM GMT
అల టీజర్ కు ముహూర్తం ఖరారు
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురము లో' సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు నెలల ముందు నుంచే ఈ సినిమా ప్రచారం ప్రారంభమయింది. ఇప్పుడు నెలరోజులే సమయం ఉంది కాబట్టి ప్రమోషన్స్ లో జోరు పెరుగుతోంది.

ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు 'అల వైకుంఠపురములో' టీజర్ గ్లింప్స్ ను ను విడుదల చేస్తున్నామని.. సినిమా టీజర్ ను డిసెంబర్ 11 వ తేదీన విడుదల చేస్తున్నట్టు 'అల వైకుంఠపురములో' టీమ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇది అభిమానులకు సూపర్ ట్రీట్ అనే చెప్పవచ్చు. ఇప్పటికే 'అల వైకుంఠపురములో' సినిమా నుండి మూడు పాటలు విడుదల కాగా రెండు పాటలకు భారీ ఆదరణ దక్కింది. దీంతో ఈ సినిమా టీజర్ పై ఇప్పటికే అంచానలు పెరిగిపోయాయి. మరి ఈ టీజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. టబు.. జయరామ్.. సుశాంత్.. నివేద పేతురాజ్.. నవదీప్.. సునీల్.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేష్.. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్.. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.