Begin typing your search above and press return to search.

పిక్ టాక్: మీసాలు మెలేసి బరిలో దిగిన సోగ్గాళ్ళు..!

By:  Tupaki Desk   |   31 Dec 2021 11:30 AM GMT
పిక్ టాక్: మీసాలు మెలేసి బరిలో దిగిన సోగ్గాళ్ళు..!
X
కింగ్ అక్కినేని నాగార్జున - యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటిస్తున్న తాజా చిత్రం ''బంగార్రాజు''. కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాని సంక్రాంతి పండక్కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

'బంగార్రాజు' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు 'లడ్డుండా' 'నా కోసం' 'వాసివాడి తస్సాదియ్యా' పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో న్యూ ఇయర్ ను సెలబ్రేట్ చేయడానికి మేకర్స్ సోగ్గాళ్ల టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. రేపు (జనవరి 1) ఉదయం గం. 11.22 నిమిషాలకు టీజర్ వదులుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

'బంగార్రాజు' టీజర్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నాగార్జున ట్వీట్ చేస్తూ.. ఇది పండుగాలాంటి సినిమా అని పేర్కొన్నారు. అలానే సరికొత్త పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇందులో అక్కినేని ద్యయం నాగ్ - చైతూ ఒకే ఫ్రేమ్ లో మీసాలు మెలేస్తూ కనిపిస్తున్నారు. నాగార్జున పంచె కట్టులో ఉండగా.. చైతన్య కలర్ ఫుల్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్నారు. ఛార్మింగ్ లో ఒకరికొకరం పోటీగా నిలుస్తామని చెప్పకనే చెబుతున్నారు. ఒకే ఫ్రేమ్ లో తండ్రీకొడుకులను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

నాగార్జున నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్ గా ''బంగార్రాజు'' సినిమా తెరకెక్కుతోందనే సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ - చైతన్య ఇద్దరూ బంగార్రాజులుగా కనిపించనున్నారు. కొత్త ఏడాదిని ప్రేక్షకులతో జరుపుకోడానికి రేపు టీజర్ తో రాబోతున్నారు. ఇద్దరు ఛార్మింగ్ సోగ్గాళ్ల సందడి చూడటానికి సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీంతో పాటుగా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని ఆశిస్తున్నారు.

కాగా, రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ''బంగార్రాజు'' చిత్రంలో నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ కనిపించనుంది. నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో చలపతి రావు - రావు రమేష్ - బ్రహ్మాజీ - వెన్నెల కిషోర్ - ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'బంగార్రాజు' చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా.. విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.