Begin typing your search above and press return to search.
తండ్రితో టీనేజీ కూతుళ్లు ఆ దృశ్యాలు చూడలేక.. తాప్సీ ఆవేదన!
By: Tupaki Desk | 2 July 2021 6:22 AM GMTఇంట్లో ఒకటే టీవీ.. చుట్టూ టీనేజ్ కుమార్తెలతో ఆ తండ్రి ఘాటైన బెడ్ రూమ్ దృశ్యాల్ని బాత్రూమ్ లో రొమాంటిక్ సన్నివేశాల్ని చూడాలా వద్దా? ఇలాంటి డైలమా మధ్యతరగతి కుటుంబాల్లో లేదా పేదరికంలో నిత్యం ఎదురయ్యేదే..! ఖరీదైన వారి ఇండ్లలో ఉన్నట్టు గదికో టీవీ అమర్చుకోవడం కుదరదు కదా!
పాపం అలాంటి ఇబ్బందినే తాప్సీ పన్ను కూడా ఎదుర్కొందట. పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చిన నటీమణి. తాప్సీ పన్నూ నాన్నగారితో కలిసి సినిమా చూడటానికి తన సోదరితో కలిసి కూర్చున్నప్పుడు ఇంట్లో ఎంతో ఇబ్బందికరమైన సన్నివేశాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో తాజాగా గుర్తుచేసుకున్నారు. టీవీ తెరపై ఒక స్పష్టమైన ఘాటైన దృశ్యం కనిపిస్తుంటే అది చూడాలా వద్దా? అన్న డైలమా .. చానెల్ మార్చాలా వద్దా? అన్న కన్ఫ్యూజన్.. తనకు ఎదురైంది.
ఈ టాపిక్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? అంటే.. తాప్సీ పన్నూ- విక్రాంత్ మాస్సే- హర్షవర్ధన్ రాణే కాంబినేషన్ లో వచ్చిన చిత్రం `హసీన్ దిల్ రూబా` హిందీ పల్ప్ థ్రిల్లర్ జానర్ మూవీ. ఈ మూవీలో ఘాటైన సన్నివేశాలు ఉన్నాయి. ఈ ముగ్గురూ ఎప్పుడైనా `హాట్` సినిమాలు చూస్తూ పట్టుబడ్డారా? అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా తాప్సీ సహా ఇతరులు కూడా ఎమోషనల్ గా చాలా సంగతుల్ని మాట్లాడారు.
విక్రాంత్ మాస్సే అతని బంధువులతో కలిసి తాను అలాంటి సన్నివేశాలు చూస్తుంటే తన ఆంటీగారు ఒప్పుకోలేదని అక్కడి నుంచి వెళ్లిపోయామని తెలిపారు. హర్షవర్ధన్ రాణే ఒక బి-గ్రేడ్ ఫిల్మ్ ని ఏవో కొన్ని మంచి సీన్ల కోసం చూడాల్సొచ్చిందని గుర్తుచేసుకున్నారు. రెండు గంటలు విసుగు చెందాల్సి వచ్చిందని అన్నారు. హనీనా దిల్ రుబా నటి తాప్సీ పన్నూ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక `స్పష్టమైన దృశ్యం` చూపించేటప్పుడు ఇంట్లో ఇబ్బందికరంగా ఉండేదని చెప్పారు.
``నాన్న ఎక్కువగా ఇంగ్లీష్ యాక్షన్ సినిమాలు చూసేవారు`` అని తాప్సీ ఆ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ``మాకు కేవలం ఒక టీవీ మాత్రమే ఉండేది. కాబట్టి నాన్న చూడటం మొదలుపెడితే మాకు వెంట చూడటం తప్ప వేరే మార్గం లేదు. మేము సినిమాలు చూడటానికి బయటికి వెళ్ళలేం. ఒక్కొక్కటి లవ్ మేకింగ్ లేదా ఒక ఘాటైన చూడలేని స్పష్టమైన దృశ్యం కనిపిస్తే ఇబ్బంది కలిగేది. ఇలాంటివి ఎవరికైనా మీ టీనేజ్ కుమార్తెల పక్కన ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి అక్కడే కూచుని చూడాలంటే అందరికీ చెమటలు పట్టేస్తాయి. అలాంటి క్లిష్ఠ సమయంలో ఎవరు ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము.. అని తెలిపారు.
ఇబ్బందికర సన్నివేశం వచ్చినప్పుడు అకస్మాత్తుగా ``మొక్కలకు నీరు పొందడానికి బయలుదేరడం లేదా ఛానెల్ మార్చడం ఉత్తమం`` అని తాప్సీ అన్నారు. ఇలాంటివి నా విషయంలో జరిగాయి. కానీ ఎవరికీ దొరికిపోలేదు.. అని తాప్సీ తెలిపారు.
వినిల్ మాథ్యూ దర్శకత్వం వహించిన హసీన్ దిల్ రూబా శుక్రవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. కార్గో- డాలీ కిట్టి ఔర్ వో చమక్తే సీతారే-గిన్ని వెడ్స్ సన్నీ తరువాత వరుసగా విక్రాంత్ నాల్గవ నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్టు. కనికా ధిల్లాన్ ఈ సినిమా స్క్రిప్టును అందించారు. తాప్సీ తదుపరి పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. లూప్ లాపెటా- దోబారా- రష్మి రాకెట్ - శభాష్ మిథు వంటి చిత్రాలు క్యూ లైన్ లో ఉన్నాయి.