Begin typing your search above and press return to search.
రాఖీభాయ్ చేశాడని తను కూడా..
By: Tupaki Desk | 28 May 2022 2:00 PM GMTకొన్ని సినిమాలు చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి. అప్పట్లో 'శివ' ట్రెండ్ సెట్టర్ అయిందని సినిమాలో నాగార్జున వాడిన సైకిల్ చైన్ లు పట్టుకుని చాలా మంది యువత వీధుల్లో వీరంగం చేశారు. అదే సమయంలో డా. రాజశేఖర్ నటించిన 'అంకుశం' విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో చాలా మంది రాజశేఖర్ తరహాలో రైట్ హ్యాండ్ కి కడం పెట్టుకుని హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల 'అర్జున్ రెడ్డి' పాథ్ బ్రేకింగ్ హిట్ గా నిలవడంతో చాలా మంది బుల్లెట్ లకు ఎడిక్ట్ అయిపోయారు.
ఇదే తరహాలో ఇటీవల విడుదలై పాన్ ఇండియా వైడ్ గా 'కేజీఎఫ్ 2' వరత్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ వసూళ్ల పరంగానే కాకుండా పలు విధాలుగా రికార్డుల్ని నమోదు చేసింది. అత్యధికంగా ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించిన మూవీగా రికార్డుని సొంతం చేసుకున్న ఈమూవీ వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ మూవీ రూ. 1200 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సంచలనంగా మారింది. బాలీవుడ్ లో ఈ మూవీ 'దంగల్' రికార్డుల్ని చెరిపేసి సరికొత్త చరిత్రని సృష్టించింది.
ఇదిలా వుంటే ఈ సినిమా ఫీవర్ యూత్ లో మాసీవ్ గా మారింది. సినిమాలో యష్ ఏది చేస్తే అది చేసేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఈ సినిమా చూసిన ఓ 15 ఏళ్ల కుర్రాడు తల్లిదండ్రులతో పాటు డాక్టర్లకు తాజాగా షాకిచ్చాడు.
హైదరాబాద్ కు చెందిన 15 ఏళ్ల యంగ్ బాయ్ గత రెండు రోజుల్లో 'కేజీఎఫ్ 2'ని మూడు సార్లు చూశాడట. రాఖీభాయ్ గా తనని తాను ఊహించుకుని తనకు లేని సిగరేట్ అలవాటుని మొదలు పెట్టాడట. యష్ మేనియాలో పడి ఏకంగా సిగరేట్ డబ్బా మొత్తం ఒక్క రోజులోనే ఉఫ్ మని ఊదేశాడట. దీంతో అతడికి గొంతు నొప్పి, తీవ్రమైన దగ్గు రావడంతో షాక్ కు గురైన తల్లిదండ్రులు అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయించారట.
వైద్యులు అడిగిన ప్రశ్నలకు యంగ్ బాయ్ చెప్పిన సమాధానం విని వారంతా షాక్ అయ్యారట. ఆ తరువాత అతనికి వైద్యం చేసిన డాక్టర్లు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా సిగరేట్ తాగడం వల్ల కలిగే అనర్ధాలను వివరించి లైఫ్ లో ఎప్పుడూ సిగరేట్ తాగకుండా చేశారట. ప్రస్తుతం సదరు యంగ్ బాయ్ పరిస్థితి బాగానే వుందని, అతనికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది.