Begin typing your search above and press return to search.
మెగా హీరోలపై గోపీచంద్ పంతం
By: Tupaki Desk | 16 Jun 2018 5:51 AM GMTమెగా మేనల్లుడు.. మెగా అల్లుడు మధ్య పోటీ విషయంలో ఇప్పటికే ఇండస్ట్రీలో మాంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి. జూలై 6వ తేదీన సాయి ధరం తేజ్ నటించిన తేజ్ ఐ లవ్యూ.. కళ్యాణ్ దేవ్ అరంగేట్రం మూవీ విజేత.. విడుదల అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏదైనా వెనక్కు వెళుతుందో లేదో.. ఆ మేరకు అసలు చర్చలు జరుగుతున్నాయో లేదో అనే విషయంలో కూడా అప్ డేట్ లేదు.
అయితే.. కరుణాకరన్ డైరెక్షన్ లో రూపొందిన తేజు ఐ లవ్యూ పక్కా లవ్ స్టోరీ. మరోవైపు కళ్యాణ్ దేవ్ నటించిన విజేత అయితే.. తండ్రీ కొడుకుల సెంటిమెంట్ పై నడిచే ఫ్యామిలీ కంటెంట్. సో ఈ రెండు సినిమాలు ఒకే రోజున వచ్చినా నష్టం ఎవరికీ లేదనే టాక్ ఉంది. ఇప్పుడిదే రోజుకు గోపీచంద్ కూడా రావాలని ఫిక్స్ అయిపోయాడు. పంతం అనే టైటిల్ పై గోపీచంద్ నటిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు చక్రి రూపొందించాడు. ఇది కంప్లీట్ గా గోపీచంద్ జోనర్ లోనే మాస్ ఎలిమెంట్స్ తోనే ఉంటుందట.
మాస్ హీరో గోపీచంద్ 25వ సినిమా కావడంతో ఆసక్తిగానే ఉంది. కొత్త దర్శకుడు రూపొందించిన కంటెంట్ కావడంతో.. విభిన్నంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాను తీసుకెళ్లి మెగా హీరోల ఇద్దరితో పాటు రిలీజ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకటి లవ్ స్టోరీ.. మరొకటి ఫ్యామిలీ కంటెంట్.. గోపీ చంద్ మాస్ మూవీ.. సో ఎవరికీ నష్టం లేకుండా బ్యాలెన్స్ అయిపోవచ్చని అంటున్నారు ట్రేడ్ జనాలు.