Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ఆమెను తలస్తే ఉప్పెనే
By: Tupaki Desk | 29 Feb 2020 5:15 AM GMTఆమె నవ్వు.. ఆమె వలపు.. ఆమె తలపు.. ఆమె చూపు.. ప్రతిదీ వెంటాడేవే. అమె దివ్యమైన రూపాన్ని తలచుకుంటే గుండె ఉప్పెనై ఉరకలెత్తడం ఖాయం. ఇదిగో ఈ కుర్రాడి పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది. గుండె గోదారి `ఉప్పెన` హోరుతో ప్రభంజనంలా కొట్టుకుపోతోంది. ఆమెను మిస్సయిన భావనను తలిస్తేనే ఉరుమురుముతోంది.
మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న `ఉప్పెన` కథాకమామీషు ఏంటో ఆ పోస్టర్లలోనే అర్థమవుతోంది. లెక్కల మాష్టార్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకుడిగా పరిచయం అవుతున్నా జాలర్ల కథతో భారీ ప్రయోగమే చేస్తున్నాడని అర్థమవుతోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ సహా తొలి సింగిల్ మెగాభిమానుల్లోకి దూసుకెళ్లాయి.
ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి కథానాయికగా నటిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌కు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురువు మాండోలిన్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. మార్చి 2 న మొదటి సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా పోస్టర్ లో వైష్ణవ్ తేజ్ విరహ వేదనతో ఆవేదనగా అరుస్తున్న తీరు చూస్తుంటేనే డీప్ లవ్ మ్యాటర్ ఇదని అర్థమవుతోంది. ఆ అందమైన కళ్లతోనే కృతి శెట్టి బోలెడంత మ్యాజిక్ చేస్తోంది. ఉప్పెన ఒక మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. రాజీకి రాకుండా తెరకెక్కిస్తున్నారు. ఎట్టకేలకు అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ 2 న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.