Begin typing your search above and press return to search.
షకీలా సినిమా టికెట్టు కొనుక్కుని చూసిన డైరెక్టర్
By: Tupaki Desk | 29 May 2023 3:45 AM ISTమలయాళంలో శృంగార రస చిత్రాల్లో నటించింది షకీలా. అర్థనగ్న సన్నివేశాలతో థియేటర్లలో కాకలు పుట్టించే షకీలా సినిమా వస్తోంది అంటే మమ్ముట్టి-మోహన్ లాల్ లాంటి హీరోలే తమ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు వెనకాడేవారని టాక్ ఉంది. అయితే అంతటి పాపులారిటీ ఉన్న ఈ భామ గురించి ఆరంభం మన తెలుగు దర్శకుడు తేజకు అసలేమీ తెలీదట.
ఓసారి హైదరాబాద్ లోని ఓ థియేటర్ వైపుగా తన స్నేహితులు ఆర్పీ పట్నాయక్ సహా వేరొకరితో కలిసి కార్ లో వెళుతుండగా తారకరామ థియేటర్ వద్ద కుర్రకారు గుంపులుగా తోసుకుంటూ లోనికి వెళ్లడం చూశారట. దీంతో వెంటనే కార్ దిగి వెళ్లి థియేటర్ మేనేజర్ ని అడిగి మూడు టికెట్లు కొనుక్కుని లోనికి వెళ్లారట.
మీరు ఇలాంటి సినిమా చూడ్డం ఏమిటి? అంటూ మేనేజర్ ఆశ్చర్యపోయినా కానీ టికెట్లు కొనుక్కుని లోనికి వెళ్లారట. అందులో 'కామేశ్వరి' అనే సినిమా ఆడుతోంది. షకీలా టైటిల్ పాత్రధారి. షకీలా అలా తెరపై కనబడగానే కుర్రకారు హారతులు పట్టడం చూసి తేజ నిజంగా ఆశ్చర్యపోయారట.
ఆ తర్వాత తన జయం(నితిన్) సినిమాలో కాలేజ్ లెక్చరర్ పాత్రకు షకీలాను ఫిక్సయిపోయానని తేజ తాజా ఈవెంట్లో వెల్లడించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి అభిరామ్ ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ తేజ రూపొందించిన 'అహింస' విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా ప్రమోషనల్ ఈవెంట్లో తేజ స్వయంగా షకీలా క్రేజ్ గురించి వర్ణించిన తీరు షాకిస్తోంది. ఎందరో నటీనటులు టెక్నీషియన్లను టాలీవుడ్ కి పరిచయం చేసిన తేజ షకీలాను తెలుగు తెరకు పరిచయం చేసారు.
అహింస ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాలను తేజ తెలిపారు. అహింసలో అభిరామ్ సరసన గీతిక కథానాయికగా పరిచయం అవుతోంది.