Begin typing your search above and press return to search.
‘ఘాజీ’ని పొగుడుతూ..సినిమాలపై విమర్శలు
By: Tupaki Desk | 20 Feb 2017 4:51 AM GMTడైరెక్టర్ తేజ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఎవరి మీదైనా విమర్శలు చేయడానికి వెనుకాడడు. ఆయన మాటల్లో ఒక ఫైర్ ఉంటుంది. అంతా ఓకే కానీ.. అప్పుడప్పుడూ ఆయన చేసే విమర్శలు.. ఆయనకే తగులుతుంటాయి. ఇప్పుడు మరోసారి ఇలాగే జరిగింది. ప్రస్తుతం తేజ.. రానా హీరోగా ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానా కొత్త సినిమా ‘ఘాజీ’ని ఆయన బలవంతంగా చూడాల్సి వచ్చిందట. ఐతే అయిష్టంగానే ఈ సినిమా చూశానని.. కానీ సినిమా అయ్యాక తన అభిప్రాయం మారిపోయిందని అన్నాడు తేజ. ‘ఘాజీ’ సినిమాకు సంబంధించి రానాను తేజనే స్వయంగా ఇంటర్వ్యూ చేయడం విశేషం.
ఈ సందర్భంగా ‘ఘాజీ’ని పొగిడేస్తూ టాలీవుడ్ మీద విమర్శలు గుప్పించాడు తేజ. ‘‘నేను మామూలుగా తెలుగు సినిమాలు తక్కువగా చూస్తుంటా. ఎందుకంటే ఎప్పుడూ అవే ఊర సినిమాలు వస్తుంటాయి. కామెడీ ట్రాకులు.. ఐటెం నంబర్లు.. ఎకిలి కామెడీలు.. ఇవే ఉంటాయి. తెలుగు సినిమాలంటే నాకు కొంచెం చులకన భావం ఉంటుంది. చాలా బాగున్నాయని చెబితే తప్ప తెలుగు సినిమాలు చూడను. రానాతో ఇప్పుడు సినిమా చేస్తున్నా కాబట్టి ‘ఘాజీ’ సినిమా చూడాల్సి వచ్చింది. ఈ సినిమా బాగోదని అనుకున్నా. మరి సినిమా చూసి బాగోలేదంటే రానా ఏమనుకుంటాడో అనుకున్నా. కానీ సినిమా చూశాక నా అభిప్రాయం మారిపోయింది. అద్భుతమైన సినిమా ఇది’’ అన్నాడు తేజ. ఐతే ‘జయం’ దగ్గర్నుంచి మొన్నటి ‘హోరాహోరీ’ వరకు తీసిన సినిమాలే మళ్లీ మళ్లీ తీసి జనాల్ని విపరీతంగా ఫ్రస్టేట్ చేసిన తేజ.. తెలుగు సినిమా అంటే తనకు చులకనభావం అని.. రొటీన్ సినిమాలే వస్తుంటాయని అనడమే ఇక్కడ విడ్డూరం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/