Begin typing your search above and press return to search.
హీరోపై సెటైర్ వేసిన తేజ
By: Tupaki Desk | 4 Aug 2015 2:54 PM GMT‘‘నాతో పని చేయడం నటీనటులకైనా.. టెక్నీషియన్స్ కైనా పెద్ద టార్చర్. షూటింగ్ లో నేనేం చేస్తానో నాకే తెలియదు’’ అని మొహమాటం లేకుండా చెప్పుకునే డైరెక్టర్ తేజ. సరిగా చేయకుంటే షూటింగులో చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని స్వయంగా ఒప్పేసుకున్నాడు కూడా. ఐతే మధ్యలో అగ్రెషన్ తగ్గించేయడం తన సినిమాల మీద కూడా ప్రభావం చూపించిందని.. ఐతే ‘హోరాహోరీ’ విషయంలో మాత్రం మళ్లీ ఒకప్పటిలాగే ఉన్నానని.. అందరితో చాలా కఠినంగా వ్యవహరించానని చెప్పాడు. కొత్త వాళ్లను పరిచయడం చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న తేజ.. హోరాహోరీ తో హీరో హీరోయిన్ల తో పాటు చాలామంది కొత్తవాళ్లను టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు.
ఈ సందర్భంగా తన హీరో హీరోయిన్లు దిలీప్, దక్ష.. విలన్ చస్వా గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఓ మాట చెబుతాను. దాన్ని బట్టి ఎవరి పై సెటైర్ వేశానో అర్థం చేసుకోండి. దక్ష తెలుగమ్మాయి కాదు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాం. ఐతే ఆ అమ్మాయి తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా చెప్పింది. విలన్ చస్వా కన్నడ నటుడు. అతను కూడా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పాడు. ఐతే దిలీప్ తెలుగబ్బాయి. కానీ అతను మాత్రం తెలుగులో డబ్బింగ్ చెప్పలేకపోయాడు. నేను ఎవరికి కాంప్లిమెంట్ ఇచ్చానో.. ఎవరి పై సెటైర్ వేశానో మీరే అర్థం చేసుకోండి’’ అని మొహమాటం లేకుండా హీరో గాలి తీసేశాడు తేజ. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి కోడూరి గురించి చెబుతూ.. ‘‘సినిమా మధ్య లో మేమిద్దరం ఎన్నిసార్లు గొవ పడ్డామో లెక్కేలేదు. అవి సరదా గొడవలు కూడా కాదు. నిజంగానే తీవ్రంగా గొడవపడ్డాం. ఓసారి మధ్యలో వెళ్లిపోయాడు. నిర్మాత అడిగినా.. నేనతనితో పని చేయలేనండీ అనేశాడు. నిర్మాత బతిమాలి తీసుకురావాల్సి వచ్చింది’’ అని చెప్పాడు తేజ.