Begin typing your search above and press return to search.

ఆ సినిమా తీస్తే 5 కోట్లు ఇస్తారట

By:  Tupaki Desk   |   30 Sep 2017 4:47 AM GMT
ఆ సినిమా తీస్తే 5 కోట్లు ఇస్తారట
X
సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టేవారి నోట వచ్చే పదం ‘ఒక్క ఛాన్సు’. తెరపై ఒక్కసారి కనిపిస్తే తామేంటో ప్రూవ్ చేసుకుందామని తెగ తపిస్తుంటారు. అదే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నా కాలం కలిసిరాక అపజయాలు ఎదుర్కొంటున్న వారి నోట వచ్చే పదం ‘ఒక్క హిట్టు’. ఎందుకంటే ఆ ఒక్క హిట్టు మళ్లీ వాళ్లని అందలం ఎక్కిస్తుంది. కోరుకున్న అవకాశాలు దక్కేలా చేస్తుంది.

ఒకప్పుడు యూత్ అండ్ టీనేజ్ లవ్ స్టోరీలతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన డైరెక్టర్ తేజ తర్వాత చాలా వెనుకబడిపోయాడు. ఒకే ఫార్ములా పట్టుకుని సినిమాలు తీసి ఎదురు దెబ్బలెన్నో తిన్నాడు. చివరకు రూటు మార్చి దగ్గుబాటి వారబ్బాయి రానాతో పొలిటికల్ మూవీ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ తీశాడు. ఈ సినిమా హిట్ తేజకు మళ్లీ లైఫిచ్చింది. ఇప్పుడు తమకో సినిమా చేసిపెట్టమని నిర్మాతలు అతడి చుట్టూ తిరుగుతున్నారు. బాలకృష్ణ హీరోగా తెలుగుతేజం నందమూరి తారక రామారావు బయోపిక్ డైరెక్ట్ చేయడానికి తేజకు నిర్మాత సాయి కొర్రపాటి ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చాడనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. ఈ సినిమా డైరెక్ట్ చేసే పక్షంలో తేజకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

‘‘నేనే రాజు.. నేనే మంత్రి మూవీతో పొలిటికల్ బేస్డ్ మూవీ బాగా తీయగలడని తేజ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోఎన్టీఆర్ బయోపిక్ డైరెక్షన్ కు సంబంధించి ప్రొడ్యూసర్స్ తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా రెమ్యునరేషన్ ఎంత అనేది ఇంకా ఫైనల్ కాలేదు’’ అని తేజ సన్నిహితుడు ఒకరు తెలిపారు. నేనే రాజు - నేనే మంత్రి సినిమాకు అందుకున్న రెమ్యునరేషన్ కు తాజా ఆఫర్ మొత్తం రెట్టింపు కావడం విశేషం.