Begin typing your search above and press return to search.
పండగ చేస్కోవయ్యా తేజా
By: Tupaki Desk | 7 Sep 2015 9:48 AM GMTవరుసగా రెండంకెల సంఖ్యలో ఫ్లాపులు తీశాక కూడా ఓ దర్శకుడి సినిమాకు క్రేజ్ రావడమంటే మాటలు కాదు. ఈ విషయంలో తేజ అదృష్టవంతుడే. అతడి ప్రతి సినిమాకూ క్రేజ్ రావడం.. ఈసారి హిట్టు కొట్టేస్తాడేమో అని ఆశ రేగడం.. తీరా సినిమా చూస్తే నిరాశ పరచడం మామూలైపోయింది. తేజ చివరి సినిమా ‘నీకు నాకు డ్యాష్’ కూడా అదే బాటలో సాగింది. ఐతే ‘హోరా హోరీ’ అలా అయ్యే అవకాశమే లేదని.. ఈసారి హిట్టు గ్యారెంటీ అని అంటున్నాడు తేజ. దామోదర ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత తేజను నమ్మి పెట్టుబడి పెట్టడం.. సురేష్ బాబు లాంటి మరో అగ్ర నిర్మాత భాగస్వామిగా చేరడం చూస్తుంటే.. ‘హోరాహోరీ’లో ఏదో విశేషం ఉన్నట్లే ఉంది. చాన్నాళ్ల కిందటే ఫస్ట్ కాపీ రెడీ అయిపోయినా.. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు తేజ, దామోదర ప్రసాద్.
వారికిప్పుడు మంచి డేటు దొరికింది. కాలం కలిసొచ్చి పోటీ లేకుండా సోలోగా రిలీజవబోతోంది ‘హోరాహోరీ’. ముందు ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’కు పోటీగా తమ సినిమాను విడుదల చేద్దామా వద్దా అని సందేహించగా.. ఇప్పుడా సినిమా ఈ శుక్రవారం రేసు నుంచి తప్పుకోవడంతో ‘హోరాహోరీ’ని సోలోగా రిలీజ్ చేయబోతున్నారు. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన డెస్పరేట్ స్థితిలో తేజకు ఇలా కలిసి రావడం విశేషమే. తనేంటో రుజువు చేసుకోవడానికి ఇంత కంటే మంచి ఫ్లాట్ ఫాం దొరకదు. దిలీప్, దక్ష అనే కొత్త హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో ఓ కన్నడ నటుడు విలన్ గా పరిచయమవుతున్నాడు. కళ్యాణి కోడూరి పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. కంటెంట్ పరంగానే కాకుండా.. టేకింగ్ పరంగానూ ఓ కొత్త అనుభూతి కలిగిస్తుంది తన సినిమా అంటున్నాడు తేజ. చూద్దాం ఎలా ఉంటుందో!