Begin typing your search above and press return to search.
నచ్చకుంటే బూతులు తిట్టండి పర్వాలేదు
By: Tupaki Desk | 22 May 2019 6:24 AM GMTదర్శకుడు తేజ స్టేజ్ పై చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆయన మాట్లాడిన మాటలు చాలా నిజాయితీగా అనిపిస్తాయి. ఆయన ఎప్పుడు కూడా చాలా నిజాయితీగా మాట్లాడతాడనే టాక్ ఎప్పటి నుండో ఉంది. స్టేజ్ పై అయినా ఇంటర్వ్యూలో అయినా మరెక్కడైనా కూడా చాలా నిజాలు నిజాయితీగా చెప్పడం, తన తప్పును నిజాయితీగా ఒప్పుకోవడం చేస్తూ ఉంటాడు. తాజాగా సీత ప్రీ రిలీజ్ వేడుకలో కూడా మరోసారి తేజ తన సహజ స్వభావంతో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఆయన మాట్లాడుతూ నేనో గొప్ప సినిమా తీశానని చెప్పడం లేదు. ప్రేక్షకులను మెప్పించేందుకు సాధ్యమైనంతగా ఒక మంచి సినిమా చేసేందుకు ప్రయత్నించాను. నేను చేసిన దాంటో పది శాతం తప్పులు ఉంటే వాటిని మళ్లీ సరి చేశాను. ఇప్పుడు మీ ముందుకు తీసుకు రాబోతున్నాను. సినిమా బాగా లేకుంటే నిర్మొహమాటంగా చెప్పేయండి. సినిమా బాగా లేకుంటే తర్వాత సినిమాకు తాను చేసిన తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. నేనెప్పుడు విమర్శలను పాజిటివ్ గా స్వీకరించి వాటిని మళ్లీ జరుగకుండా చూసుకుంటానంటూ చెప్పుకొచ్చాడు.
'సీత' చిత్రం నచ్చక పోతే నన్ను తిట్టండి పర్వాలేదు. నా పనితనం బాగాలేకుంటే నేను తిట్లను స్వీకరిస్తానంటూ తేజ అన్నాడు. సినిమాలో నటించిన నటీనటులు మరియు పని చేసిన టెక్నీషియన్స్ అంతా కూడా అద్బుతంగా పని చేశారు. నేను మాత్రమే యావరేజ్ గా వర్క్ చేశానంటూ తేజ చెప్పుకొచ్చాడు. నన్ను సినిమా చూసిన తర్వాత తిట్టినా పొగిడినా ఆ ప్రభావం నా తర్వాత సినిమాలో ఉంటుందని తేజ అన్నాడు. మొత్తానికి తేజ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.