Begin typing your search above and press return to search.
తేజ గాలి శీను వైపు
By: Tupaki Desk | 25 Jun 2018 8:11 AM GMTదర్శకుడు తేజ బహుశా కెరీర్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కొని ఉండకపోవచ్చు. ఒక పక్క ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ చేజారటం మరోవైపు వెంకటేష్ తో భారీ అంచనాలతో మొదలుపెట్టుకున్న ఆటా నాదే వేటా నాదే డ్రాప్ అయిపోవడం ఒకేసారి జరిగాయి. ఇది కొత్త న్యూస్ కానప్పటికీ తేజ ఇప్పటి దాకా ఇలాంటి అనుభవమైతే ఫేస్ చేయలేదు. ఏ దర్శకుడికైనా సినిమాలు చేజారడం అనుకోకుండా వేరేది కమిట్ కావడం సహజంగా జరిగేదే. కానీ ఒకేసారి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు వదిలేయాల్సి రావడం మాత్రం అరుదు. అందుకే తేజ రూట్ మార్చి తనకు అచ్చివచ్చిన యూత్ హీరోల వైపే టర్న్ తీసుకుంటున్నాడు. తాజా సమాచారం మేరకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ ఒక సినిమా రూపొందించనున్నట్టు సమాచారం. హీరోయిన్ గా కాజల్ నే తీసుకున్నట్టు కాస్త గట్టిగానే వినిపిస్తోంది. తేజ్ కం బ్యాక్ మూవీ నేనే రాజు నేనే మంత్రిలో రాధాగా కాజల్ కు మంచి మార్కులు పడ్డాయి.
షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది టీమ్ ఏంటి అనే వివరాలు బయటికి రాలేదు కానీ ప్రాజెక్ట్ మాత్రం ఓకే అయినట్టు సమాచారం. సాక్ష్యం కాకుండా కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాలో సాయి శ్రీనివాస్ ఇప్పటికే కాజల్ తో జట్టు కట్టాడు. ఇప్పుడు ఇది కూడా పట్టాలెక్కితే వరసగా రెండో సినిమా అవుతుంది. అ! తర్వాత కాస్త స్పీడ్ తగ్గించిన కాజల్ మంచి ఆఫర్ తో వచ్చే ఏ ప్రపోజల్ ను వదులుకోవడం లేదు. పైగా తన డెబ్యూ మూవీ లక్ష్మి కళ్యాణం దర్శకుడు తేజ అంటే కాజల్ కు గౌరవం. నేనే రాజు నేనే మంత్రి చేయడానికి అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఈసారి తేజ లవ్ స్టోరీ తీసుకుంటాడా లేక యాక్షన్ వైపు మళ్లుతాడా అనేది వేచి చూడాలి.
రానాతో మరో సినిమా చేయొచ్చు అనే వార్తలు ఉన్నాయి కానీ ఇప్పటికే కమిట్ అయిన వాటికే రానాకు టైం లేదు. అవన్నీ ఫినిష్ చేయటంతో పాటు వ్యక్తిగతంగా కొంత రెస్ట్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు రానా. ఈ నేపథ్యంలో తన కోసం వెయిట్ చేస్తే ఆలస్యం అవుతుందని సురేష్ బాబు సైతం సలహా ఇవ్వడంతో తేజ సాయి శ్రీనివాస్ వైపు వచ్చినట్టు వినికిడి. మొత్తానికి బెల్లంకొండ హీరో మంచి క్రీజీ దర్శకులని పట్టేసుకుంటున్నాడు.