Begin typing your search above and press return to search.
వర్మ మాటలు గుర్తు తెచ్చుకో తేజా..
By: Tupaki Desk | 15 Sep 2015 9:30 AM GMTవారం రోజులుగా టాలీవుడ్ లో డైరెక్టర్ తేజ పేరు మార్మోగిపోతోంది. తెలుగు సినిమా పోకడల గురించి.. సినీ ప్రముఖులు పల్లెటూళ్లను దత్తత తీసుకోవడం గురించి.. తాను పరిచయం చేసిన వాళ్లు తనను పట్టించుకోవడం గురించి.. సెన్సేషనల్ కామెంట్ లు చేశాడు తేజ. ఏకంగా వెయ్యిమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశానంటూ ఓ ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. అయినా తేజ తీసిందే పదకొండు సినిమాలు. మరి వెయ్యి మందిని ఎలా పరిచయం చేసేశాడని మనం అడక్కూడదు. ఆ నంబర్ ఎగ్జాజరేషనే అయినప్పటికీ ఎంతో కొందమందినైతే పరిచయం చేశాడు కాబట్టి అతను అభినందనీయుడే. ఐతే తన సినిమా ద్వారా పరిచయమైన వాళ్లందరికీ తనే జీవితాన్ని ప్రసాదించినట్లు తేజ చెప్పుకోవడమే విడ్డూరమైన విషయం.
తేజ వల్ల వాళ్లు బాగుపడ్డారు తప్పితే.. తేజకు వాళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదా? అన్నది ఇక్కడ ప్రశ్న. ఓ సినిమా విజయవంతమైతే ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టరే తీసుకుంటాడా? నటీనటులకు, మిగతా సాంకేతిక నిపుణులకు దక్కదా? ఉదాహరణకు ‘జయం’ సినిమా విషయమే తీసుకుందాం. ఆ సినిమాలో అందరూ కొత్త వాళ్లే. దానికి నిర్మాత కూడా తేజానే. ఆ సినిమా పాతిక కోట్ల దాకా కలెక్ట్ చేసింది. నటీనటులెవరికీ పారితోషకం లేదు. మహా అయితే మ్యూజిక్ డైరెక్టరుకి - సినిమాటోగ్రాఫరుకి ఓ మోస్తరు రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటాడు తేజ. ప్రొడక్షన్ ఖర్చు - పారితోషకాలు కలిపితే కోటో రెండు కోట్లో ఉంటుందంతే. మిగతాదంతా తేజ జేబులోకే వెళ్లింది. సినిమా తీసింది ఆయనే కావచ్చు. కానీ నటీనటులు - సాంకేతిక నిపుణులు లేకుండా సినిమా తయారయ్యేదే. వాళ్లందరికీ ఈయన అవకాశమిస్తే.. వాళ్లంతా కలిసి ఆయనకు అంత ఆదాయం తెచ్చిపెట్టలేదా? ఆ డబ్బులతోనే తేజ ఇంతకాలం నెట్టుకురావట్లేదా?
కొత్త వాళ్లను తీసుకోవడంలో తేజకున్న ప్రయోజనాలు తేజకున్నాయి. వాళ్లు పారితోషకం అడగరు. అవకాశమే గొప్పనుకుంటారు. తేజ చెప్పినట్లు చేస్తారు. డేట్ల సమస్యలు కానీ, ఇగో సమస్యలు కానీ ఉండవు. పారితోషకాల బాధ ఉండదు. ఈ సౌలభ్యం కోసమే కొత్త వాళ్లతో సినిమాలు చేస్తాడన్నది మరో కోణం. అయినా తన సినిమాకు పనికొస్తారని.. టాలెంట్ ఉన్న వాళ్లనే కదా తేజ ఎంచుకుంటాడు. నటించడం చేతకాని, పనికి రాని వాళ్లనైతే తీసుకోడు కదా. ఇదంతా పక్కనబెడితే పరిశ్రమలో ఎవరూ ఎవరికీ అవకాశాలివ్వడం, లైఫ్ ఇవ్వడం అన్నది ఉండదనే రామ్ గోపాల్ వర్మ మాటల్ని గుర్తుంచుకోవాలి. నిజానికి వర్మ అవకాశాలిచ్చిన వాళ్ల సంఖ్య తేజతో పోలిస్తే ఎన్నో రెట్లుంటుంది. ఐతే తానెవరికీ లైఫ్ ఇచ్చినట్లు, ఎవరినీ ఉద్దరించినట్లు వర్మ చెప్పుకోడు. ఈ విషయంలో వర్మ ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పాడు. ‘‘నేనెవ్వరికీ అవకాశాలివ్వలేదు. వాళ్లలో టాలెంట్ ఉందని గ్రహించా. ఆ టాలెంటుని వాడుకున్నా. నా సినిమాల ద్వారా వాళ్లు విజయవంతమైతే ఆ క్రెడిట్ వాళ్లకే దక్కుతుంది. నేను ఆ క్రెడిట్ ఎలా తీసుకుంటాను’’ అని నా ఇష్టం పుస్తకంలో చెప్పాడు వర్మ. అన్నట్టు తేజ కూడా వర్మ ద్వారా సినిమాటోగ్రాఫరుగా పరిచయమైనవాడే.