Begin typing your search above and press return to search.

కొత్తాళ్ళతో ఇక ఛస్తే చేయను

By:  Tupaki Desk   |   20 Aug 2017 10:00 AM GMT
కొత్తాళ్ళతో ఇక ఛస్తే చేయను
X
అసలు కొత్త కొత్త నటీనటులను తెరకు పరిచయం చేయడం అనేది ఒక ఆర్టు. చాలా తక్కువమంది దర్శకులు మాత్రమే అలా చేయగలరు. మనం ఎంతగానో ఆరాధించే రాజమౌళి అండ్ త్రివిక్రమ్ వంటి దిగ్గజాలు కూడా కొత్తాళ్లను పరిచయం చేయలేదు. కాని దాసరి నారాయణరావు వంటి దిగ్గజాలు ఎంతోమంది కొత్త నటులను స్టార్లను చేశారు. మోహన్ బాబులను సృష్టించారు. అలాంటి కోవకే చెందుతాడు దర్శకుడు తేజ కూడా. ఓ విధంగా ఉదయ్ కిరణ్‌.. నితిన్.. నవదీప్.. కాజల్ అగర్వాల్.. ఆర్.పి.పట్నాయక్.. ఇలాంటి వారందరికీ లైఫ్‌ ఇచ్చాడు. కాని ఇప్పుడు రూట్ మార్చాడట.

చిత్రం.. నువ్వు నేను.. జయం వంటి సినిమాలను కొత్తాళ్ళతో తీసి విజయాలు కొట్టిన తేజ.. ఆ తరువాత చాలా ఫ్లాపులే తీశాడు. అందుకే ఇప్పుడు రానా అండ్ కాజల్ వంటి స్టార్లతో సినిమాను తీశాడట. కాబట్టి మరోసారి కొత్తాళ్ళతో చేస్తాడా? ''అసలు కొత్తవారితో చేయడం శుద్ధ దండగ. ఏసుప్రభువు లాగా నేనేమీ అందరినీ ఉద్ధరించడానికి రాలేదు.. ఈ మధ్యనే నాకు బుద్ధుడి టైపులో జ్ఞానోదయం అయింది. సో ఇక నుండి కథకు తగ్గ పేరున్న హీరోలనే పెట్టుకొని సినిమాలు చేస్తాను. కొత్తవాళ్ళకు యాక్టింగ్ నేర్పించి ఒక ఆలోచనను తెరపై పండించడానికి చాలా చాలా కష్టపడాలి. ఒక్కోసారి అనుకున్నట్లు రాదు. స్టార్స్‌ అయితే మన థాట్స్ చక్కగా తరువాతి రేంజుకు వెళిపోతాయ్'' అంటున్నాడు తేజ.

కాస్త కొత్తవాళ్ళకు లైఫ్ ఇచ్చే డైరక్టర్ ఒక్కరైనా ఉన్నారని అనుకుంటే.. ఇప్పుడు తేజ కూడా వారికి హ్యాండిచ్చేసి స్టార్లనే పెడతా అంటున్నాడు. ప్చ్!!