Begin typing your search above and press return to search.
తేజకు ఏమీ ఇవ్వలేదా?
By: Tupaki Desk | 3 May 2018 5:30 PM GMTనందమూరి తారక రామారావు బయోపిక్ కోసం తేజను బాలయ్య దర్శకుడిగా ఎంచుుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. బాలయ్య అడిగితే అడిగాడు కానీ.. తేజ ఒప్పుకోవడమూ ఆశ్చర్య మే. వీళ్లిద్దరి వ్యక్తిత్వాల ప్రకారం చూస్తే కలిసి పని చేయడం అంత సులువు కాదు. ఐతే ఇద్దరికీ అంగీకారం కుదిరింది. పని మొదలుపెట్టారు. దాదాపు ఆరు నెలల నుంచి ఈ సినిమా కోసం కష్టపడ్డాడు తేజ. ఈ సినిమా కోసమే విక్టరీ వెంకటేష్ తో ఆల్రెడీ మొదలుపెట్టిన సినిమాను కూడా పక్కన పెట్టాడు. వేరే ఆఫర్ల వైపు కూడా చూడకుండా దీనికే అంకితమయ్యాడు. కానీ చివరికి అనూహ్య పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి బయటికి వచ్చేశాడు. మరి ఆరు నెలల పాటు ఎన్టీఆర్ బయోపిక్ కోసం కష్టపడ్డందుకు తేజకు దక్కిన ఫలితమేంటి అంటే.. సున్నానే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఈ చిత్రం కోసం తేజ ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా తీసుకోలేదట.
ఎన్టీఆర్ బయోపిక్ కు బాలయ్యే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. సాయి కొర్రపాటి.. విష్ణు ఇందుకూరి కూడా నిర్మాణ భాగస్వాములైనప్పటికీ ప్రధాన పెట్టుబడి బాలయ్యదే. రెగ్యులర్ ప్రొడక్షన్ హౌజులైతే ముందు అడ్వాన్స్ చేతిలో పెట్టి పని మొదలుపెట్టిస్తాయి. ఐతే బాలయ్య సంస్థ అలా చేయలేదట. ఇందులో వేరే ఉద్దేశాలేమీ లేవు కానీ.. ఆర్థిక విషయాల మీద పెద్దగా ఫోకస్ పెట్టకుండా ముందు పని మొదలుపెట్టారట. తేజ కూడా ఆ విషయంలో పర్టికులర్ గా ఏమీ లేడని సమాచారం. సినిమా మొదలయ్యాక ఏమైనా అడ్వాన్స్ మెయింటైనెన్స్ కోసం డబ్బులు తీసుకునేవాడేమో. కానీ ఈలోపే ఆయన బయటికి వచ్చేయాల్సి వచ్చింది. అతను తప్పుకోవడం బాలయ్య అండ్ టీంకు చాలా ఇబ్బందికరంగా మారింది. వాళ్లు తేజ అంటేనే మండిపోతున్న పరిస్థితి. ఈ స్థితిలో ఇప్పటిదాకా చేసిన పనికి డబ్బులివ్వండి అని అడిగే పరిస్థితి లేదు. తేజ కూడా అలా ఏమీ ఆశించలేదట. మొత్తానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి హిట్ తర్వాత మాంచి డిమాండ్లో ఉన్న సమయంలో తేజ కెరీర్లో విలువైన ఆరు నెలలు వృథా అయిపోయాయి. ఈ సినిమా లేకపోయి ఉంటే ఈపాటికి వెంకీ చిత్రాన్ని పూర్తి చేసేసేవాడు. దాని తాలూకు రెమ్యూనరేషన్ అందేది. మరో సినిమా మొదలుపెట్టి ఉండేవాడు. పాపం అలా కొన్ని కోట్లు నష్టపోయాడన్నమాట తేజ.