Begin typing your search above and press return to search.
ఉదయ్ కిరణ్ నాకు అన్ని విషయాలు చెప్పాడు!
By: Tupaki Desk | 11 July 2019 4:52 PM GMTటాలీవుడ్ లో యంగ్ హీరోలకు దివంగత ఉదయ్ కిరణ్ జీవితం ఒక గుణపాఠం అంటూ ఉంటారు. 'చిత్రం' సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యి అతి తక్కువ సమయంలోనే స్టార్ డంను దక్కించుకున్న ఉదయ్ కిరణ్ చేసిన కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా కెరీర్ డౌన్ ఫాల్ మొదలయ్యింది. సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఇలా జరుగుతుంది.. కాని ఉదయ్ కిరణ్ సక్సెస్ ఉన్న సమయంలో జాగ్రత్త పడ్డ దాఖలాలు లేవు. అందుకే ఉదయ్ కిరణ్ అవకాశాలు లేని సమయంలో ఇబ్బందులకు గురయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడని భావించిన సమయంలో అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్ వస్తే బాగుంటుందనే చాలా మంది భావిస్తున్నారు.
ఉదయ్ కిరణ్ గురించి అంతా తెలిసిన వ్యక్తి తేజ. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన తేజ అయితేనే బయోపిక్ ను బాగా తెరకెక్కించగలడని అంతా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో తేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయాలనే ఆలోచన లేదని చెప్పుకొచ్చాడు. ఉదయ్ కిరణ్ జీవితంలోని ప్రతి విషయాన్ని నాకు చెప్పేవాడు. అతడి కెరీర్ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు అన్ని కూడా నాకు తెలుసు. కాని నాకు ఉదయ్ కిరణ్ బయోపిక్ తీసి క్యాష్ చేసుకోవాలని లేదు.
అతడు లేని సమయంలో ఇప్పుడు బయోపిక్ తీసి ఏం ప్రయోజనం. నాకు డబ్బులు వస్తాయేమో కాని అతడికి ఏం లాభం జరుగుతుంది. బయోపిక్ తీయాలనే ఆలోచనే నాకు నచ్చడం లేదు. ఉదయ్ కిరణ్ గురించి మీరు సినిమా తీస్తే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారికి ఉపయోగదాయకంగా ఉంటుంది కదా అంటూ ప్రశ్నించిన సమయంలో ప్రేక్షకులు సందేశాలను స్వీకరించే పరిస్థితిలో లేరు. సినిమా అంటే కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే ఉండాలి. నేను సినిమాను ఎంటర్ టైన్ మెంట్ కోసమే తీస్తానంటూ తేజ చెప్పుకొచ్చాడు.