Begin typing your search above and press return to search.

వార్నీ తేజా.. ఏ మ్యాజిక్ చేశావ్?

By:  Tupaki Desk   |   25 Dec 2015 4:00 AM IST
వార్నీ తేజా.. ఏ మ్యాజిక్ చేశావ్?
X
డైరెక్టర్ తేజ హిట్టు కొట్టి పుష్కరం దాటిపోయింది. ‘జయం’ తర్వాత ఓ మోస్తరు సినిమా కూడా రాలేదు ఆయన్నుంచి. తేజ తాజా సినిమా ‘హోరాహోరీ’ ఫలితమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తేజ సినిమా విడుదలైనపుడల్లా.. ‘అంతన్నాడే ఇంతన్నాడే..’ అనే పాట వినిపిస్తుంది బ్యాగ్రౌండ్లో. ఆయన చెప్పే మాటలకు.. సినిమాలోని విషయానికి అసలు పొంతనే ఉండదు. ఐతే ఎన్ని ఫ్లాపులు ఎదురైనా.. మళ్లీ ఇంకో అవకాశం దక్కించుకుంటుండటమే విచిత్రం. అందులోనూ ఇప్పుడు తేజ దక్కించుకున్న ఛాన్స్ గురించి తెలిస్తే షాకవ్వక తప్పదు. ప్రముఖ బాలీవుడ్ సంస్థ ‘యూటీవీ’ బేనర్లో తేజ ఓ బహు భాషా చిత్రం చేయబోతుండటం విశేషం.

వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తాడట. అతడి జీవితానికి దగ్గరగా ఉండేలా క్రికెట్, ఐపీఎల్ బెట్టింగ్-ఫిక్సింగ్ స్కాండల్ నేపథ్యంలో సాగే కథ ఇదని అంటున్నారు. ఇప్పటిదాకా తన సినిమాలకు తనే కథలు రాసుకున్న తేజ.. తొలిసారి వేరే వ్యక్తి స్క్రిప్టుతో ఈ సినిమా తీయబోతున్నాడట. తేజ ఆలోచనలు భారీగానే ఉన్నాయని.. దీనికి ఎంచుకున్న టెక్నీషియన్లను పరిశీలించినా అర్థమవుతుంది. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్.. సౌత్ ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకు పని చేస్తారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ తో అందరికీ షాకివ్వబోతున్నాడు తేజ.