Begin typing your search above and press return to search.

జోగేంద్రపై చెయ్యెత్తడమా.. నో ఛాన్స్

By:  Tupaki Desk   |   9 Aug 2017 10:21 AM GMT
జోగేంద్రపై చెయ్యెత్తడమా.. నో ఛాన్స్
X
కొత్తవాళ్లతో సినిమా తీయడమంటే ఓ రకంగా సాహసమే. వాళ్ల దగ్గర నుంచి కావలసిన నటన రాబట్టుకోవడానికి నానా తంటాలు పడాలి. ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించాలి. తన సినిమాలోని యాక్టర్ల నుంచి కావలసిన నటన రాబట్టుకోవడం డైరెక్టర్ తేజ స్పెషాలిటీ. దానికోసం అవసరమైతే కొట్టేదాకా వెళ్తాడని ఇండస్ట్రీలో పేరుంది. దానిపై నెగిటివ్ కామెంట్స్ వచ్చినా తేజ పెద్దగా లెక్క చేయడు. అవసరమైన పక్షంలో కొట్టడం తప్పేం కాదని అంటాడు.

చాలా గ్యాప్ తర్వాత తేజ ఓ భారీ చిత్రం డైరెక్ట్ చేశాడు. రానా హీరోగా నేనే రాజు - నేనే మంత్రి సినిమా తీశాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ కు వచ్చిన తేజకు షూటింగ్ సమయంలో రానా పై చేయి చేసుకున్నారా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి తేజ సమాధానమిస్తూ అసలు అలాంటి పరిస్థితే తలెత్తలేదన్నాడు. పైపెచ్చు రానా చాలా తెలివైన నటుడని... ఏదైనా సీన్ గురించి చెబితే ఒక రోజంతా దాని గురించి డైరెక్టర్ కు కావాల్సిన అవుట్ పుట్ ఇస్తాడని చెప్పుకొచ్చాడు. సెట్ లో రానా కనిపించలేదని... జోగేంద్రే కనిపించాడని... అలాంటి నటులు చాలా తక్కువమంది ఉంటారని ప్రశంసలు కురిపించాడు. అలాంటి నటుడిపై చెయ్యాత్తాల్సిన అవసరం తనకే కాదు... అసలెవరికీ ఉండదని చెప్పాడు.

లాంచింగ్ టైంలో డైరెక్టర్ ఒకటి రెండు మాటలన్నా... తేజలాగా ఒక దెబ్బ వేసినా ఎవరైనా సర్దుకుపోతుంటారు. ఆల్రెడీ క్రిష్ - రాజమౌళి - రామ్ గోపాల్ వర్మ లాంటి పెద్ద దర్శకులను తన నటనతో మెప్పించిన వాడు రానా. అలాంటిది అతడిపై చెయ్యి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయినా భళ్లాలదేవుడిని కొట్టాలంటే బాహుబలి తప్ప ఇంకెవరి వల్ల అవుతుంది.