Begin typing your search above and press return to search.

తేజపై ఒత్తిడి పెంచేస్తున్నారా?

By:  Tupaki Desk   |   19 Jan 2018 11:30 PM GMT
తేజపై ఒత్తిడి పెంచేస్తున్నారా?
X
ట్యాలెంటెడ్ డైరెక్టర్ గానే కాదు.. ట్రెండ్ సెట్టర్ గా కూడా దర్శకుడు తేజకు మంచి గుర్తింపు ఉంది. చాలా కాలం పాటు బ్యాడ్ ఫేజ్ ఎదుర్కున్న ఈ డైరెక్టర్.. నేనే రాజు నేనే మంత్రి మూవీతో మళ్లీ హిట్టు పట్టాలెక్కాడు. తెలుగులో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలతోనూ హిట్ కొట్టొచ్చని ప్రూవ్ చేశాడు.

అయితే.. ఆ తర్వాత అదే జోనర్ లో రెండు సినిమాలు రూపొందించాలంటూ తేజకు ఆఫర్స్ వచ్చాయి. తనకు బ్రేక్ ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే మరో సినిమా చేయడానికి కమిట్ అయిన తేజ.. వెంకటేష్ తో తీసే చిత్రానికి ఇప్పటికే స్టోరీతో పాటు స్క్రిప్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాడు. మరోవైపు లొకేషన్స్ కూడా ఫైనల్ అయిపోవడంతో.. ఇక షూటింగ్ ను బిగిన్ చేయడమే ఆలస్యం అనేవరకూ సిట్యుయేషన్ వచ్చింది. అయితే.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందే బయోపిక్ ఎన్టీఆర్ కు కూడా తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది.

తాజాగా ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. ఈ సినిమా కోసం తాను సర్వం సిద్ధం అంటున్న బాలయ్య.. తేజ ఎప్పుడు సై అంటే అప్పుడు షూటింగ్ మొదలైపోతుందని చెబుతున్నారు. దీంతో ఏ చిత్రం వైపు మొగ్గాలి.. ఏది మొదట ప్రారంభించాలనే అంశంపై తేజపై ఒత్తిడి పెరుగుతోందని అంటున్నారు. అయితే.. ఆరంభం నుంచి తన మనస్తత్వం ప్రకారం నిర్ణయాలు తీసుకునే తేజ.. ఇలాంటి ఒత్తిళ్లను ఈజీగానే అధిగమించేయగలడని ఇండస్ట్రీ టాక్.