Begin typing your search above and press return to search.
పూరి గొడవ.. తేజ వెరైటీగా స్పందించాడు
By: Tupaki Desk | 20 April 2016 11:30 AM GMTపూరి జగన్నాథ్ కు.. ‘లోఫర్’ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నడుస్తున్న గొడవ టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. పెద్ద సినిమాలు నష్టపోయినపుడు నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం చెల్లించాలా లేదా అన్నది ఎప్పట్నుంచో నడుస్తున్న చర్చే. ఐతే తాజా గొడవతో మరోసారి ఇది పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంలో ఇండస్ట్రీలో చాలామంది పూరి జగన్నాథ్ కే మద్దతుగా నిలుస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు లాభాలు వచ్చినపుడు నిర్మాతకు వెనక్కి ఏమీ ఇవ్వనపుడు.. వాళ్లు నష్టపోతే ఎందుకు పరిహారం చెల్లించాలి అని లా పాయింట్లు తీస్తున్నారు. ఐతే దర్శక నిర్మాత తేజ మాత్రం ఈ వాదనకు భిన్నంగా మాట్లాడుతున్నాడు. స్వయంగా నిర్మాత అయి ఉండీ అతను డిస్ట్రిబ్యూటర్లకు మద్దతుగా మాట్లాడ్డం విశేషం.
‘‘ఒకప్పుడు ఎన్టీఆర్.. కృష్ణ.. చిరంజీవి లాంటి హీరోలకు పర్మనెంటుగా.. స్టాండర్డ్ నిర్మాతలుండేవాళ్లు.. డిస్ట్రిబ్యూటర్లూ ఉండేవాళ్లు. అందరూ ఒకరి కష్ట నష్టాల్ని మరొకరు పంచుకునేవాళ్లు. కానీ ప్రస్తుతం తెలుగులో ఏ హీరోకూ పర్మనెంట్ నిర్మాతలూ.. డిస్ట్రిబ్యూటర్లూ లేరు. హీరోలు.. దర్శకులు తమ మార్కెట్ కు మించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తీసుకుంటున్నారు. దీంతో మొత్తం వ్యవస్థే నాశనమైంది. నిర్మాతలకు.. హీరోలకు డబ్బులు రావడానికి కారణమైన డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లే లేకుండా పోతే ఇక సినిమాలు రిలీజ్ చేసేదెవరు.. ఆడించేదెవరు..? కాబట్టి వాళ్లను కాపాడుకోవాలి. సినిమాకు ఎక్కువ నష్టాలొస్తే.. దర్శకులు.. హీరోలు కూడా కొంత డబ్బులు వెనక్కివ్వాలి. డైరెక్టర్ పారితోషకాన్ని వెనక్కివ్వడం నాతోనే మొదలైంది. ‘ధైర్యం’ సినిమాకు అలాగే చేశా. సినిమా ఆడకపోతే డబ్బు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందంటే అప్పుడు దర్శకులు - హీరోలు ఒళ్లు దగ్గర పెట్టుకొని సరైన కథలతో సినిమాలు తీస్తారు. నా దృష్టిలో డిస్ట్రిబ్యూటర్లు పరిహారం కోరడం మంచి పరిణామం’’ అని తేజ అన్నాడు.