Begin typing your search above and press return to search.
'ఇష్క్' వీడియో సాంగ్: యువ హృదయాలను తాకే అందమైన 'ఆనందం మదికే'
By: Tupaki Desk | 24 July 2021 6:08 AM GMT'జాంబిరెడ్డి' ఫేమ్ తేజ సజ్జా - ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా రూపొందిన తాజా చిత్రం ''ఇష్క్''. 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది దీనికి ట్యాగ్ లైన్. కొత్త దర్శకుడు యస్.యస్. రాజు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జూలై 30న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచింది. ఇప్పటికే రిలీజ్ చేయబడిన టీజర్ - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకోవడంతో.. తాజాగా 'ఆనందం మదికే' అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ స్వరపరిచిన 'ఆనందం మదికే' పాట లిరికల్ వీడియో ఇప్పటికే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు వచ్చిన వీడియో సాంగ్ కూడా వీక్షకులను ఆకట్టుకుంటోంది. ''ఏమైందో ఈవేళా ఈ గాలి.. రంగులేవో చెల్లిందా.. అందమైన ఊహేదో మదిలో వాలి.. అల్లరేదో చేసిందా..'' అంటూ సాగిన ఈ పాట యువ హృదయాలను తాకుతుంది. బిగ్ స్క్రీన్ పై విజువల్ గా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ అందమైన ప్రేమ గీతానికి లిరిసిస్ట్ శ్రీమణి సాహిత్యం అందించారు. యువ సంచలనం సిద్ శ్రీరామ్ - సత్య యామిని కలిసి తమదైన గాత్రంతో అలరించారు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు అందించిన విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. దీనికి విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. వరప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ - పారస్ జైన్ - వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా 'ఇష్క్' చిత్రాన్ని నిర్మించారు.