Begin typing your search above and press return to search.
పిక్ టాక్: స్టైలిష్ లుక్ లో జాంబీల హీరో..!
By: Tupaki Desk | 24 Jun 2021 2:30 PM GMTతెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జా.. 'ఓ బేబీ' సినిమాలో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో 'జాంబీ రెడ్డి' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. టాలీవుడ్ ఫస్ట్ జోంబీల సినిమాగా వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్ళు రాబట్టి తేజకు హిట్ అందించింది. దీంతో ఇప్పుడు యువ హీరోకి క్రేజీ ఆఫర్స్ అందుతున్నాయి.
లేటెస్ట్ గా హైదరాబాద్ టైమ్స్ మ్యాగజైన్ కోసం తేజ సజ్జా ఓ ఫోటోషూట్ నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను యంగ్ హీరో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీటిలో తేజ ట్రెండీ వైట్ కాస్ట్యూమ్స్ - రెడ్ కలర్ షూ ధరించి స్టెప్స్ పై కూర్చొని ఫోజ్ ఇచ్చాడు. ఇందులో 'జాంబీరెడ్డి' హీరో షార్ప్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే తేజ సజ్జా ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ తో కలసి ''ఇష్క్'' - 'నాట్ ఎ లవ్‌స్టోరీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతోంది. అలానే శివాని రాజశేఖర్ తో కలసి ''వెన్నెల'' అనే ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఇక టాలీవుడ్ పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ వారితో తేజ సజ్జా ఓ సినిమా కమిట్ అయ్యాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.