Begin typing your search above and press return to search.

పద్దతి గల ఐటమ్ సాంగ్ చేశా

By:  Tupaki Desk   |   8 Dec 2016 9:27 AM GMT
పద్దతి గల ఐటమ్ సాంగ్ చేశా
X
తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయ్ లు కనిపించడం చాలా చాలా తక్కువ. ఒకవేళ మూవీస్ చేసినా ఒకటీ ఆరా సినిమాలకే పరిమితమైపోతారు. అయితే అలాంటి వాళ్లందరికి కాస్త డిఫరెంటని చెప్పాలి తేజస్విని మదివాడ గురించి. ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే ఇంకోవైపు ఫ్రెండ్స్ రోల్ లోనో.. పెద్ద హీరోల సినిమాలో చిన్న పాత్రల్లో మెరవడానికి కూడా ఆలోచించదు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక ఆఫర్ తో బిజీగా ఉంటుంది తేజూ.

లేటెస్ట్ గా నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో హీరోయిన్ హెబ్బా ఫ్రెండ్ గా చేసింది తేజస్విని. ఈక్వెల్ టూ సెకండ్ హీరోయిన్ రోల్ లో మెరిసిన తేజస్విని- మూవీలో హీరోయిన్ చేసే ప్రతి వెధవ పనికి సపోర్ట్ చేస్తూ బుక్కైపోతుంటానని.. ఆ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో మూవీలో చూస్తే తెలుస్తుందని ఆడియో రిలీజ్ ఫంక్షన్లో తన పాత్ర గురించి చెప్పింది. అంతేకాదు పద్దతి గల ఐటమ్ సాంగ్ కూడా చేశానని చెప్పుకొచ్చింది.

దిల్ రాజు బ్యానర్లో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేయడం అదృష్టమన్న తేజస్విని ప్రొడ్యూసర్ నుంచి చాలా నేర్చుకున్నానని.. నేను నా బాయ్ ఫ్రెండ్స్ లో తన రోల్ కి మరింత గుర్తింపు రావడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది. రేస్ లో చెప్పుకోతగ్గ సినిమాలు లేకపోవడంతో ఈ నెల 16న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మీద కాస్త బజ్ అయితే క్రియేటైంది. మరి ఈ సారి హీరోస్ సపోర్ట్ లేకుండా సోలోగా వస్తోన్న కుమారి హెబ్బా పటేల్ మ్యాజిక్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.