Begin typing your search above and press return to search.

'బ్లాక్ డ్రెస్'లో సెగలు రేపుతున్న తెలుగు వయ్యారం..!!

By:  Tupaki Desk   |   28 Dec 2020 10:45 AM GMT
బ్లాక్ డ్రెస్లో సెగలు రేపుతున్న తెలుగు వయ్యారం..!!
X
తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర బాషల హీరోయిన్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎక్కడో పదిమందిలో ఒకరిద్దరు తెలుగు అమ్మాయిలు కనిపిస్తారు. అందులో కొందరు మాత్రమే హీరోయిన్లుగా సక్సెస్ అవుతుంటారు. మాక్సిమం ఇండస్ట్రీలో ఉన్నవారంతా పరబాషా హీరోయిన్లే. ఒకవేళ తెలుగమ్మాయి హీరోయిన్ అయినా తెలుగు భామలను ఆదరించే సినీ ప్రియులు తక్కువ. ఎందుకంటే తెలుగు భామలు గ్లామర్ షో చేయడంలో కొన్ని హద్దులు పెట్టుకుంటారు. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఉన్నవారికి పోటీగా.. తను కూడా మంచి యాక్టర్ అవుతా అంటూ తెరమీదకు ఎంట్రీ ఇచ్చిన తెలుగందం తేజస్వి మడివాడ. ఫామ్ లో ఉన్న హీరోయిన్లంత కాకపోయినా తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత గ్లామర్ ఒలికించడానికి అమ్మడు రెడీనే అంటోంది. ఇక తేజస్వి సినీ నటిగా కంటే బిగ్ బాస్ రియాలిటీ షోలో 'కాంట్రవర్సీ క్వీన్'గా బాగా పాపులర్ అయింది.

అయితే బిగ్ బాస్ తేజస్వికి సినిమా అవకాశాలు అందించే ప్లాట్ ఫామ్ అవుతుందని అనుకున్నట్లుంది. కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా మారింది అమ్మడి పరిస్థితి. బిగ్ బాస్ తర్వాత ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన తేజస్వి సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లతో కుర్రకారు మతులు పోగొడుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య పరువాల షో డోస్ కాస్త పెంచినట్లుగా అనిపిస్తుంది. ఇదివరకే లోదుస్తులు లేకుండా ఝలక్ ఇచ్చిన తేజస్వి.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో సెగలు రేపుతోంది. ఎందుకంటే అమ్మడి హెయిర్ స్టయిల్, రొమాంటిక్ లుక్స్, చూపించనట్లుగా చూపించే అందాలు అన్ని కెమెరా ముందు పరిచేసింది. అవకాశాలు లేకపోయినా అమ్మడి ఫిగర్ చూస్తూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చూడాలి తేజస్వి త్వరలో ఏదైనా సినిమాతో అలరిస్తుందేమో..!!