Begin typing your search above and press return to search.

లిప్ కిస్ కూడా పెట్టేసిన తెలుగు పిల్ల

By:  Tupaki Desk   |   8 Dec 2016 4:17 AM GMT
లిప్ కిస్ కూడా పెట్టేసిన తెలుగు పిల్ల
X
అసలు ఎక్సపోజింగ్ కు ఆమడ దూరం అని చెప్పింది తెలుగు పిల్ల తేజస్వి మదివాడ. కాని తరువాత ఐస్ క్రీం సినిమాలో రచ్చ పీక్స్ కు తీసుకెళ్ళింది. ఆ సినిమాలో తనలోని గ్లామర్ యాంగిల్ ఎలా ఉండోబోతుందో చూపించేసింది. అయితే తరువాత అమ్మడు గ్లామర్ కు దూరం అని చెప్పిందిలే. కాని చూస్తుంటే ఇప్పుడు తన గ్రాఫ్‌ ను వేరే రేంజుకు తీసుకెళ్లేలా ఉందిలే.

బాలీవుడ్ సెక్స్ కామెడీ 'హంటర్' రీమేక్ లో తేజస్వి ఒక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్నాడు. అయితే మనోడితో ఒక కిస్ సీన్ అనగానే అమ్మడు ముందులో కాస్త కంగారుపడిందికాని.. చివరకు దిగ్విజయంగా ఆ సీన్ చేసేసిందట. చాలా ప్యాషనేట్ లిప్ కిస్ సీన్ ను చాలా అద్భుతంగా చేసింది తేజస్వి అంటున్నారు సన్నిహితులు. నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఈ సినిమాకు ''బాబు బాగా బిజీ'' అనే టైటిల్ ను ఎంచుకున్నారు. బెంగాళీ బ్యూటి మిష్టీ చక్రవర్తి.. అలాగే యాకంర్ శ్రీముఖి మరో ఇద్దరు హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే సినిమాలో అన్నేసి ఎడల్డ్ సీన్లు పెట్టుకుంటూ పోతే అసలు సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందా అనేదే ఇప్పుడు సందేహం. చూద్దాం ఏమవుతుందో!!