Begin typing your search above and press return to search.

'ఐస్ క్రీమ్' బ్యూటీ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా...?

By:  Tupaki Desk   |   21 May 2020 5:18 PM GMT
ఐస్ క్రీమ్ బ్యూటీ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా...?
X
తేజస్వి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. మొదట్లో సిల్వర్ స్క్రీన్ పై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తేజస్వి.. ఆ తరవాత రోజుల్లో హీరోయిన్ గా మారింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తరవాత ‘మనం’ ‘హార్ట్ ఎటాక్’ 'కేరింత' 'ఐస్ క్రీమ్' 'జత కలిసే' సినిమాల్లో నటించింది. హీరోయిన్‌ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా టాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగమ్మాయి అయిన తేజస్వీకి వెండితెరపై ఓ మోస్తరు అవకాశాలే వచ్చాయని చెప్పవచ్చు. అయితే 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఈ షో లో గ్లామర్, ఆటలు, పాటలు, కోపాలు అన్ని ఎమోషన్స్ చూపిస్తూ బిగ్ బాస్ ని బాగానే ఆకట్టుకుంది.

'బిగ్ బాస్ సీజన్ 2'లో ఆమె కంటెస్టెంట్‌ గా హౌస్‌ లోకి వెళ్లి క్రేజీ బ్యూటీగా ఇమేజ్‌ ను క్రియేట్ చేసుకుంది. అయితే 'బిగ్ బాస్' నుంచి బయటికి వచ్చిన తరవాత ఈమె ఎక్కడికో వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. కాకపోతే టీవీ షోలలో కనిపించింది. అయితే ఆమె పై ఉన్న నెగెటివిటీ కారణంగా తేజస్వీ అక్కడ కూడా నిలబడలేకపోయింది. ఎన్నో ఆశలతో బ్రహ్మానందంతో చేసిన షో అట్టర్ ఫ్లాప్ అయింది. అటు బుల్లితెర ఇటు వెండితెరపై అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు వెబ్‌ సిరీస్‌ లపై దృష్టి పెట్టింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలతో ఇంటికే పరిమితమైన తేజస్వి.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఇంట్లో ఉంటూనే ఫొటో షూట్‌ లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేస్తోంది. నిత్యం కుర్రకారుకి వేడి పుట్టించే ఫోటోలను షేర్ చేస్తూ మతి పోగోడోతోంది. పొట్టి పొట్టి నిక్కర్లను వేసుకుని అందాల ప్రదర్శన చేస్తోంది. ఈ ఫొటోలు చూస్తోన్న కుర్రాళ్లు లైకుల మీద లైకులు కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తేజస్వి ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన తెలుగమ్మాయి ఈ ఫోటోలలో మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. అందాలను ఆరబోస్తూ రెచ్చ గొడుతోంది తేజస్వి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు 'తేజస్వి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలను చూసైనా దర్శక నిర్మాతలు అమ్మడికి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.
Tags: