Begin typing your search above and press return to search.

హిప్ మీద లూజ్ ఫ్యాంటు నిల‌వ‌నంటోంది!!

By:  Tupaki Desk   |   19 July 2020 5:30 AM GMT
హిప్ మీద లూజ్ ఫ్యాంటు నిల‌వ‌నంటోంది!!
X
ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ అవ‌కాశం కోసం కొన్నేళ్ల పాటు కృష్ణాన‌గ‌ర్ ఫిలింన‌గ‌ర్ లో ఎక్కే గ‌డ‌పా దిగే గ‌డ‌పా అంటూ ఎంతో ప్ర‌య‌త్నిస్తే కానీ ఆర్టిస్టుకు అవ‌కాశాలు దొర‌క‌వు. అంద‌రిలానే తాను కూడా ప్ర‌య‌త్నించింది తెలుగ‌మ్మాయి తేజ‌స్వి మ‌దివాడ‌. ఎట్ట‌కేల‌కు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ రూపంలో ఈ అమ్మ‌డికి అదిరిపోయే ఆఫ‌ర్ దొరికింది. `ఐస్ క్రీమ్` చిత్రంతో ఈ అమ్మ‌డిని క‌థానాయిక‌ను చేసింది ఆర్జీవీనే. ఆ త‌ర్వాత ఇమేజ్ అమాంతం పెరిగింది. వ‌రుస‌గా క‌థానాయిక‌గా ప‌లు ఆఫ‌ర్లు అందుకుంది.

అయితే ఇవేవీ త‌న‌ను పెద్ద రేంజ్ కు తీసుకెళ్ల‌లేక‌పోయాయి. స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్ అయ్యింది. తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌‌టి త‌ల‌చిన చందంగా తేజ‌స్విని స్టార్ కాలేక‌పోయింది. ఆ క్ర‌మంలోనే బిగ్ బాస్- తెలుగు ఆఫ‌ర్ త‌న‌కు మ‌రింత మైలేజ్ ని పెంచ‌గ‌లిగింది. ప్ర‌స్తుతం అవ‌కాశాల్లేవ్‌. బాబు బాగా బిజీ.. బాల‌కృష్ణుడు త‌ర్వాత అవ‌కాశాలేవీ? అయినా కెరీర్ ని పాజిటివ్ థింకింగ్ తో ముందుకు న‌డిపిస్తోంది. వీలున్న ఏ వేదిక‌ను వ‌దిలి పెట్ట‌కుండా త‌న‌కు ప్ర‌చారం చేసుకుంటోంది. సోష‌ల్ మీడియాల్లో తేజ‌స్వి స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు.

ఇన్ స్టా వేదిక‌గా రెగ్యుల‌ర్ గా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను తేజ‌స్విని షేర్ చేస్తోంది. ఇవ‌న్నీ అంతే వైర‌ల్ గా అంత‌ర్జాలంలో దూసుకెళుతున్నాయి. యూత్ పిచ్చెక్కి ఫాలోవ‌ర్స్ గా మారుతున్నారు. తాజాగా తేజ‌స్విని షేర్ చేసిన లూజ్ ఫ్యాంట్ ఫోటో అంతే వైర‌ల్ గా మారింది. తెలుగ‌మ్మాయి హిప్ మీద లూజ్ ఫ్యాంట్ నిల‌వ‌నంటోంది. అయినా ఇలా జార్చినా అవ‌కాశాలిచ్చేదెవ‌రు? చినిగిన జీన్సు.. ఎద అందాల ఎర‌లు వేస్తే అవ‌కాశాలిచ్చే రోజులు కావివి. ల‌క్ కూడా క‌లిసి రావాలి క‌దా?