Begin typing your search above and press return to search.
ఆమె కొంపదీసి సమంతేనా? ఏంటీ కన్ఫ్యూజ్?!
By: Tupaki Desk | 16 Jun 2022 11:30 AM GMTప్రపంచంలో ఒకేలా కనిపించే ఏడుగురు ఉంటారని వింటుంటాం. కనీసం ఒకేలా కాకపోయినా ఒకే రకమైన ముఖకవళికలతో ఏడుగురు ఉంటారని విన్నాం. కానీ ఎవరైనా అచ్చుగుద్దినట్టు మరొకరిలా కనిపించడం సాధ్యమేనా? ఇంతకుముందు ప్రముఖ తారల క్లోనింగ్ ఫేస్ లు అంతర్జాలంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. డూప్ లు ఫేక్ లు అంటూ మీడియాల్లో స్టోరీలు అల్లారు.
ఇప్పుడు అందాల భామ సమంత రూత్ ప్రభు లాగా కనిపించే వేరొక నటి ఉంది.. ఆమె ఈమే! అంటూ టాలీవుడ్ లో చెవులు కొరుక్కోవడం చర్చగా మారింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 తో పాపులారిటీ సంపాదించిన యువనటి తేజస్వి మదివాడ తాజా ఇన్ స్టా ఫోటోలు చూసి అభిమానులంతా షాక్ తింటున్నారు. ఆమె తేజస్వినా లేక సమంతనా? అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు! ఇక ఈ ఫోటో ప్రస్తుతం యువతరంలో వైరల్ గా మారుతోంది.
ఈ ఫోటోగ్రాఫ్ లో తేజస్వి చొక్కా ధరించి బ్లాక్ కో-ఆర్డ్ సెట్ లో హాట్‌గా కనిపిస్తోంది. ఫోటోకు ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. ``నా ప్రదర్శన తప్పక కొనసాగుతుంది`` అన్నది క్యాప్షన్. కానీ ఈ ఫోటోని చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. షాక్ కి గురవుతున్నారు. ``ఆమె సమంత కాదని నిర్ధారించుకోవడానికి నేను IDని తనిఖీ చేస్తున్నాను`` అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. ``అకస్మాత్తుగా నేను సమంతా అని అనుకున్నాను`` అంటూ చాలా మంది అభిమానులు ఈ సారూప్యతను చూసి షాక్ అయ్యారు.
కానీ అబద్ధం ఎప్పుడూ నిజం కాదు! ఆమె ఆమే ఈమె ఈమే!! అంటూ కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆసక్తికరంగా తేజస్వి తన ఫేవరెట్ సమంత అని చాలాసార్లు చెప్పింది. ఫ్యాషన్స్ అండ్ స్టైలింగ్ పరంగా తనని అనుకరించేందుకు ఈ భామ ఇష్టపడుతుంది. తాజా లుక్ చూస్తుంటే సమంతలో ఏ క్వాలిటీని ఈ తెలుగమ్మాయి విడిచిపెట్టినట్టు లేదు. ఎంపిక చేసుకున్న డ్రెస్.. భంగిమ.. ఐ షాడో .. ఐ లైనర్.. ముక్కు తీరు.. మేకప్ విధానం .. హెయిర్ స్టైల్ ప్రతిదీ సమంతనే ఇమ్మిటేట్ చేసింది. అందుకే అభిమానులు ఇంతగా కన్ఫ్యూజ్ అవుతున్నారు.
తేజస్వి మదివాడ నటి కం మోడల్. తెలుగు పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నటిగా కొనసాగుతోంది. 2013లో మల్టీస్టారర్ మూవీ `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో తొలిసారిగా నటించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఉత్తమ హోమ్ వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు సహా నాలుగు నంది అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత పూరి `హార్ట్ ఎటాక్`లో ఛాన్సిచ్చారు. ఆర్జీవీ `ఐస్ క్రీమ్`తో హీరోయిన్ అయ్యింది. జత కలిసే- విష్ యు హ్యాపీ బ్రేకప్- మిస్టర్ సహా మరెన్నో చిత్రాలలో కనిపించింది. అయితే రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో కనిపించిన తర్వాత తేజస్వి పేరు మరింత మార్మోగింది. మొత్తానికి సమంతలా కనిపించడం ద్వారా ఈ భామ జాతీయ స్థాయి వెబ్ సిరీస్ డైరెక్టర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందనే అర్థం చేసుకోవాలి.
సమంత ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ గా ఎదిగారో తెలిసిందే. సామ్ తెలుగు- తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు. సమంత 2010లో ఏ మాయ చేసావే అనే తెలుగు సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ దశాబ్దపు 25 గొప్ప తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సమంత .. నాగచైతన్యల నటనకు పేరొచ్చింది. ఆ తరువాత దూకుడు- కత్తి- అ ఆ- తేరి- 24- మహానటి- సూపర్ డీలక్స్- జాను సహా ఎన్నో చిత్రాలలో సమంత కథానాయికగా నటించింది. ఇటీవల విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.