Begin typing your search above and press return to search.

ఐస్‌ క్రీమ్‌ పిల్ల ఐసైపోతోందిగా...

By:  Tupaki Desk   |   16 Aug 2015 10:09 AM GMT
ఐస్‌ క్రీమ్‌ పిల్ల ఐసైపోతోందిగా...
X
ఐస్‌ క్రీమ్‌ సినిమాతో వెలుగులోకి వచ్చింది తెలుగమ్మాయ్‌ తేజస్వి. రామ్‌ గోపాల్‌ వర్మ పుణ్యమా అని అప్పటివరకూ డ్యాన్సర్‌ గా ఉన్న ఈ భామ ఒక్కసారిగా హీరోయిన్‌ అన్న ట్యాగ్‌ తగిలించుకుంది. ఇప్పుడు ఆ ట్యాగ్‌ అన్నిచోట్లా వర్కవుటవుతోంది. ఇప్పటికే తమిళ్‌ లో ఓ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ లో ఉంది. ఈలోగానే మలయాళంలో ఎంట్రీ కోసం రెడీ అవుతోంది.

అక్కడ ప్రయత్నాలు చేస్తూనే తెలుగులో అరడజను సినిమాలకు కమిటైంది. వీటిలో కేరింత ఫేం నూకరాజు పాత్రధారి హీరోగా నటిస్తున్న సినిమాలో నాయికగా ఎంపికైంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రోజులు మారాయి అనేది టైటిల్‌. అలాగే సునీల్‌ కృష్ణాష్టమిలో, నాగశౌర్య కొత్త సినిమాలో కామియో రోల్స్‌ చేస్తున్నా. ఇవి రెండూ దిల్‌ రాజు ఇచ్చిన అవకాశాలేనని చెప్పింది. వరుసగా అవకాశాలు వస్తున్నా .. ఆచి తూచి ఎంచుకుంటున్నా. కెరీర్‌ ని తెలివిగా ప్లాన్‌ చేస్తున్నానని నవ్వేసింది ఈ భామ.

నిజానికి ఐస్‌ క్రీమ్‌ చూశాక అమ్మడు పూర్తి గ్లామరసం రోల్సే చేస్తుందని అనుకుంటే.. పర్లేదు.. బాగానే ఎంచుకుంటోంది. అయితే వీటిల్లో ఏ రోల్‌ ఆమెను హీరోయిన్ గా పెద్ద రేంజుకు తీసుకువెళుతుందో మాత్రం తెలియదు. లెటజ్‌ సీ.