Begin typing your search above and press return to search.
తెలుగమ్మాయికి తెగింపు ఎక్కువేనండోయ్
By: Tupaki Desk | 29 Jun 2016 9:30 AM GMTకుర్ర హీరోయిన్లు కొన్ని విషయాల్లో మహా డేరింగ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా అఫైర్స్ విషయంలో ఆన్సర్స్ ఇవ్వడానికి ఏ మాత్రం సందేహించడం లేదు. పైగా అడిగినవాళ్ల మొహం మాడిపోయే ఆన్సర్స్ ఇవ్వడంలో కూడా ఆరితేరిపోయారు. ఇలాంటి విషయాల్లో ఇన్నేళ్లూ తెలుగమ్మాయిలు కాస్త ఆలోచించేవారు కానీ.. ఇప్పుడు వాళ్ల నుంచి కూడా ఇదే టైపు ఆన్సర్స్ టకాటకా వచ్చేస్తున్నాయ్.
తెలుగు హీరోయిన్ తేజస్వి మదివాడ నటించిన రోజులు మారాయి చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజిబిజీగా ఉన్న తేజస్వి.. ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తోంది. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా 'ఐస్ క్రీమ్' టైమ్ లో ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకుంది తేజస్వి. 'అప్పట్లో నేను ఐస్ క్రీమ్ కి ప్రమోషన్స్ చేస్తున్నాను. వర్మ తన అందరి హీరోయిన్స్ లాగానే నాపై కూడా కొంచెం ఎక్కువగా కాన్సంట్రేట్ చేశారు. దీన్ని అపార్ధం చేసుకున్న కొందరు మీడియా జనాలు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగారు' అన్న తేజస్వి.. ఆ ప్రశ్నలు, తానిచ్చిన జవాబు ఏంటో కూడా చెప్పింది.
'రామ్ గోపాల్ వర్మతో మీకు ఎఫైర్ ఉందా? అనే ప్రశ్న నాకు ఎదురైంది. నేను ఆయనతో పడుకుంటే మీకు తెలియచేస్తాను. నేనేదైనా చేస్తే దాన్ని దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు' అని అప్పటి సంఘటన విడమర్చి చెప్పింది తేజస్వి. ఆన్సర్ అదిరింది కానీ.. ఐస్ క్రీమ్ నాటికే ఈ రేంజ్ లో ఫైర్ ఉంటే.. ఇప్పుడు రోజులు మారాయి అంటోంది కదా ఇంకెంతగా మారిపోయిందో!