Begin typing your search above and press return to search.
#MEETOOలో తెలుగమ్మాయ్ నిజమా?
By: Tupaki Desk | 17 Dec 2019 7:06 AM GMT`కమిట్ మెంట్` .. సినీ పరిశ్రమలో రెగ్యులర్ గా వినిపించే పదం. #MEETOO ఉద్యమంలో భాగంగా మరింత వెలుగులోకి వచ్చింది. ఏ రంగంలో పైకి రావాలన్నా! మహిళలతో కమిట్ మెంట్ కామన్ అయిపోయిందని మీటూ ఉద్యమంలో బాధిత మహిళలంతా గొంతెత్తి నినదించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో బిగ్ బాస్ సీజన్-3లో భాగంగా లేడీ కంటెస్టెంట్స్ అందరినీ నిర్వాహకులు కమిట్ మెంట్ అడిగారని ఆరోపణలొచ్చాయి. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి సహా బిగ్ బాస్ కు ఎంపిక కాని పలువురు నటీమణులు ఈ రియాలిటీ షో నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేయడం వేడెక్కించింది.
తాజాగా ``నేను కమిట్ మెంట్ ఇస్తాను`` అంటూ హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ తెరపైకి రావడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవలే ఈ అమ్మడు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు ప్రచారం సాగింది. దానికి హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన మరింత అప్ డేట్ అందింది. ఈ వెబ్ సిరీస్ ను `కమిట్ మెంట్` అనే టైటిల్ తో తెరకెక్కించనున్నారు. సినీ పరిశ్రమలో అవకాశాలు పేరుతో జరిగిన లైంగిక మోసాలను తెరపైకి తీసుకొస్తున్నట్లు వినిపిస్తోంది.
హీరోలు, దర్శకులు, నిర్మాతలు ... నటీమణుల్ని కమిట్ మెంట్లు అడుగుతారని, అందుకు అంగీకరిస్తేనే అవకాశాలు ఇస్తారని ఉన్న ఆరోపణల నేపథ్యంలోని కథాంశాన్ని ఎంచుకున్నారట. ఇందులో తేజస్వి మదివాడ బాధిత నటిగా ఎంతో బోల్డ్ గా నటించనుంది. అయితే ఇది వెబ్ సిరీస్ గా తెరకెక్కిస్తారా? సినిమా గా వెండి తెరకెక్కిస్తున్నారా? అన్న దానిపై పూర్తి స్పష్టత లేదు. దీనిపై తేజస్వీ కానీ.. దర్శకుడు కానీ అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతానికి తేజస్వి తనదైన శైలిలో ప్రచారం సాగిస్తోంది కానీ పూర్తి వివరాలు చెప్పడం లేదు. మీటూ- కమిట్ మెంట్ అనేది.. సంచలనాత్మక పాయింట్ కాబట్టి సినిమాగా చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందనేది పలువురి అభిప్రాయం.