Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఎంగేజ్డ్ కపుల్ తో తేజస్వి

By:  Tupaki Desk   |   29 Dec 2018 3:30 PM GMT
ఫోటో స్టొరీ: ఎంగేజ్డ్ కపుల్ తో తేజస్వి
X
తేజస్వి మదివాడ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. తరచుగా అప్డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది. ఈ రోజు తన ఇస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. మరో హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ కు ఎంగేజ్మెంట్ అయిందన్న విషయాన్ని తెలిపింది.

అనీషా - గుణ జంటతో తేజస్వి ఒక సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫిని పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు "నా బెస్ట్ ఫ్రెండ్స్ నిశ్చితార్థం అయింది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 'అలియాస్ జానకి' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనీషా అన్నీ సౌత్ భాషలలో సినిమాలు చేసింది గానీ స్టార్ ఇమేజ్ మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ నటించిన 'గోపాల గోపాల' సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. 'సర్దార్ గబ్బర్ సింగ్' లో మొదట హీరోయిన్ గా ప్రకటించారు గానీ ఫైనల్ గా అవకాశం రాలేదు. కానీ అప్పటికే పవన్ సినిమాలో హీరోయిన్ అనగానే తెలుగు ఆడియన్స్ లో ఫుల్ రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు అనీషా వివాహానికి సిద్దమవుతుండడం విశేషం.

మరి తేజస్వికి అనీషాతో ఇంత ఫ్రెండ్ షిప్ ఉందని ఇప్పటివరకూ తెలియదు. ఒక్కసారి బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అంటూ అందరినీ సర్ ప్రైజ్ చేసింది కదా. ఏదైతేనేం లెండి.. తేజస్వి ఫ్రెండ్ కు కొత్త జంటకు అల్ ది బెస్ట్ చెబుదాం.