Begin typing your search above and press return to search.

ప్రభుదేవా కొత్త ప్రేయసి తెలుగులోకొస్తోంది

By:  Tupaki Desk   |   9 Jun 2016 7:10 AM GMT
ప్రభుదేవా కొత్త ప్రేయసి తెలుగులోకొస్తోంది
X
హీరోగా నిలదొక్కుకోవడానికి దాదాపు దశాబ్దం నుంచి కష్టపడుతున్నాడు యంగ్ హీరో నందు. శివనాగేశ్వరరావు ‘ఫొటో’ సినిమాతో పరిచయమైన నందుకు అది అంత మంచి ఆరంభాన్నివ్వలేదు. ఆ తర్వాత 100 పర్సంట్ లవ్.. ఆటోనగర్ సూర్య లాంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ లో బాగానే రాణించాడు కానీ.. హీరోగా మాత్రం అతడికి సరైన బ్రేక్ రాలేదు. సూపర్ స్టార్ కిడ్నాప్.. 365 డేస్ అతడి టాలెంటేంటో చూపించాయి కానీ.. కమర్షియల్ సక్సెస్ మాత్రం అందించలేదు. ఈసారి బాగా గ్యాప్ తీసుకుని ‘కన్నుల్లో నీ రూపమే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నందు.

ఎ.ఎస్.పి క్రియేటివ్ ఆర్ట్స్ పతాకం పై భాస్కర్ భాసాని నిర్మాతగా నూతన దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూన్ 15 నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ చిత్రంలో నందు సరసన కన్నడ భామ తేజస్విని ప్రకాష్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ అమ్మాయి గురించి ఇప్పటికే టాలీవుడ్లో చర్చ జరిగింది. నయనతార నుంచి విడిపోయాక ప్రభుదేవా ఈ అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు రూమర్లున్నాయి. ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకున్నారు కాబట్టి సినిమాకు మంచి పబ్లిసిటీ వచ్చే అవకాశముంది. సాఖేత్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నాడు. మూడు నెలల్లో సినిమాను పూర్తి చేసి సెప్టెంబర్లోనే ‘కన్నుల్లో నీ రూపమే’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు నిర్మాత ప్రకటించాడు.