Begin typing your search above and press return to search.
కళాతపస్వి మనసు గాయపడే ప్రచారం!
By: Tupaki Desk | 11 Aug 2019 2:24 PM GMTలెజెండరీ దర్శకుడు.. కళా తపస్వి కె.విశ్వనాథ్ (89) ఆరోగ్యం బాలేదంటూ జరిగిన ప్రచారానికి ఆయన తీవ్రంగా నొచ్చుకోవడం ప్రస్తుతం ఫిలింవర్గాల్లో చర్చకు వచ్చింది. నేడు ఫిలింనగర్ లోని ఆయన స్వగృహంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలుసుకున్నారు. ఇది కేవలం క్యాజువల్ మీటింగ్ మాత్రమే. అయినా కొన్ని మీడియాల్లో దిగ్ధర్శకుని ఆరోగ్యం బాలేదంటూ ప్రచారం సాగింది. దీనిపై ఆయన తీవ్రంగా కలతకు గురయ్యారు. ఈ ప్రచారం తగదని తాను ఆరోగ్యంగానే ఉన్నానని కె.విశ్వనాథ్ మీడియాకి వెల్లడించారు.
పెద్దాయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆయనను సీఎం కలవడానికి ప్రత్యేక కారణం ఏదీ లేదు! అంటూ ఫిలింమీడియాకి సమాచారం అందింది. దీంతో అందరూ కూల్ అయ్యారు. కె.విశ్వనాథ్ తన కెరీర్ లో ఇప్పటివరకూ 54 క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్నోసార్లు జాతీయ అవార్డులు వరించాయి. అయితే 2010లో తెరకెక్కించిన శుభప్రదం ఫ్లాపైన తర్వాత ఆయన దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చారు. కేవలం నటుడిగానే కొనసాగుతున్నారు.
ప్రస్తుతం ఆయన వయసు దృష్ట్యా స్వగృహంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం ఉంది. వృత్తికి విరమణ తర్వాత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. ఎందరో దర్శకులకు ఆయన స్ఫూర్తి ప్రదాత. తెలుగు జాతి గర్వించదగ్గ మేటి దర్శకుడు ఆయన. తనని అభిమానించని వాళ్లే ఉండరు. అలాంటి మహిమాన్వితుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు.