Begin typing your search above and press return to search.
క్షమాపణలు చెప్పిన తెలంగాణ ఎగ్జిబిటర్స్..!
By: Tupaki Desk | 21 Aug 2021 10:38 AM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంపై థియేటర్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫిలిం ఛాంబర్ లో సునీల్ నారంగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హీరో నాని మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ థియేటర్ అసోసియేషన్ వారు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దీనిపై వివరణ ఇచ్చారు.
'టక్ జగదీష్' సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకున్న కొంతమంది ఎగ్జిబిటర్లు.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుందన్న వేదనతో అలా మాట్లాడారని ఇందులో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. ఒకవేళ ఎగ్జిబిటర్లలో ఎవరైనా ఎవరినైనా బాధపెడితే వారిని క్షమాపణలు కోరుతున్నామని ప్రకటనలో తెలిపారు.
''ట్రేడ్ మెరుగుదల కోసం మరియు వాణిజ్యంలో ప్రతి ఒక్కరికీ ఉత్తమమైన మరియు ప్రయోజనకరమైన పద్ధతులను అనుసరించడం కోసం ఆగస్టు 20న తెలంగాణ ఎగ్జిబిటర్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారని సంబంధిత తెలుగు ఫిల్మ్ ట్రేడ్ సంబంధిత ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. సినిమాని కొన్ని రోజులు మాత్రమే వాయిదా వేయాలని లేదా ప్రీపోన్ చేయాలని మా సెక్రటరీ చాలాసార్లు అభ్యర్థించారు''
''మేము వ్యాపారంలో ఎవరికీ వ్యతిరేకం కాదు. వ్యాపారంలో అందరూ ఒకే కుటుంబానికి చెందినవారని మేము నమ్ముతాము. చాలా కాలం పాటు థియేటర్లు మూతబడి ఉండటంతో 'టక్ జగదీష్' సినిమాపై కొంతమంది ఎగ్జిబిటర్‌లు ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. ఆ సినిమా OTT విడుదలను ఎంచుకున్నట్లు తెలిసి వారిలో కొందరు వ్యక్తిగతంగా అలా మాట్లాడారు''
''అవి కేవలం వేదనతో చేసిన వ్యాఖ్యలు. ఇది వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా ఎవరికీ వ్యతిరేకం కాదు. మా ఎగ్జిబిటర్లలో ఎవరైనా ఎవరినైనా బాధపెడితే, మేము ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము, వ్యాపారంలో మనమందరం ఒకే కుటుంబానికి చెందినవాళ్ళం. మేము ట్రేడ్ అభివృద్ధి కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాం. ఎవరికీ వ్యతిరేకంగా కాదు'' తెలంగాణ ఎగ్జిబిటర్స్ లెటర్ లో పేర్కొన్నారు.
కాగా, 'తిమ్మరుసు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో నాని థియేటర్లకు మద్దతుగా చెప్పిన మాటలు.. 'టక్ జగదీష్' కు ఓటీటీ నుంచి ఎక్కువ ధర రాబట్టుకోవడానికే అని నిన్న జరిగిన మీటింగ్ లో ఓ ఎగ్జిబిటర్ ఆరోపించారు. ఆ స్పీచ్ వల్ల నాని తన చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేస్తారేమో అని.. ఓటీటీ వాళ్లు మరో రూ. 4 కోట్లు ఇచ్చారని అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ లెటర్ విడుదల చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.