Begin typing your search above and press return to search.
షూటింగ్ లకు ముహూర్తం ఖరారు?
By: Tupaki Desk | 4 May 2020 1:30 PM GMTతెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే ఈ మహానగరంలోనే చాలా ఎంటర్ టైన్ మెంట్ చానళ్లు ఉన్నాయి. ఇక ప్రపంచప్రఖ్యాతి గాంచిన సినీ స్టూడియోలున్నాయి. కానీ కరోనాతో మొత్తం షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమాలు, సీరియళ్లు, ఎంటర్ టైన్ మెంట్ షోలు, వెబ్ సిరీస్ లు కూడా లాక్ డౌన్ తో ఆగిపోయాయి.
టాలీవుడ్ కు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనిపై ఆధారపడ్డ ఎంతో మంది కుటుంబాలకు ఉపాధి కరువవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ లపై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే లాక్ డౌన్ తో మూలనపడ్డ సినిమాలు ఇప్పట్లో షూటింగ్ లు మొదలుపెట్టకపోతే వాటి నిర్మాణం కష్టమే. నిర్మాతలు రోడ్డునపడుతారు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సినిమాల షూటింగ్ లకు కొన్ని పరిమితులతో అనుమతి ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
సినిమా షూటింగ్ లలో మాస్క్ లు, గ్లోవ్స్ లు, శానిటైజర్ చాంబర్లు వంటి జాగ్రత్తలు తీసుకోవాలని.. థెర్మల్ గన్ లు ఉండేలా కరోనా వ్యాప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే షూటింగ్ లకు అనుమతి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు సమాచారం.
కరోనా కేసులు తగ్గితే జూన్ 1 నుంచి తెలంగాణలో సినిమా షూటింగ్ లను అనుమతించాలని సర్కార్ యోచిస్తోంది. స్టూడియోలకు కూడా పరిమిత సంఖ్యలో సిబ్బందిని అనుమతించడం.. జాగ్రత్తలు తీసుకోవడం వంటి నిబంధనలు విధిస్తారని తెలుస్తోంది.
అయితే థియేటర్లు మాత్రం అన్ని రాష్ట్రాలతోపాటే కేంద్రం ఎత్తివేసినప్పుడే నిషేధం తొలగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు దక్షిణ భారత్, హిందీ సహా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. మనదగ్గర కూడా రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ ఉన్నాయి. ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు విడుదలవుతాయి. సో కేంద్రం నిర్ణయం ప్రకారం అన్ని థియేటర్స్ ను ఓపెన్ చేయాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయ్యింది.