Begin typing your search above and press return to search.
సినిమా టికెట్ రేట్లు: టాలీవుడ్ కు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు..!
By: Tupaki Desk | 24 Dec 2021 11:31 AM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం సినిమా టికెట్ రేట్ల వ్యవహారం మీద చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు టికెట్ ధరలు ఉండటం వల్ల నిర్మాతలు - ఎగ్జిబిటర్స్ నష్టాలు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో మీద హైకోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతిస్తూ ఇండస్ట్రీకి తీపి కబురు చెప్పింది.
సినిమా టికెట్ ధరలపై గత కొంతకాలంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. విస్తృత అధ్యయనం అనంతరం టికెట్ ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచుకోడానికి అనుమతినిచ్చింది. క్లాస్ ల వారీగా సినిమా టికెట్ కనీస, గరిష్ఠ ధరలతోపాటు వాటి మెయిటెనెన్స్ ఛార్జీలకు సంబంధించి శుక్రవారం ఓ జీవోను జారీ చేసింది.
ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.50 + జీఎస్‌టీ - నాన్ ఏసీ రూ. 30 + జీఎస్‌టీ - మల్టీప్లెక్స్ అయితే రూ.100 + జీఎస్‌టీ ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. అలానే ఏసీ థియేటర్లలో గరిష్ఠ ధర రూ.100 + జీఎస్‌టీ - నాన్ ఏసీ రూ.70 + జీఎస్‌టీ - సింగిల్ థియేటర్ రిక్లైనర్ రూ. 200 + జీఎస్‌టీ - బిగ్ స్కీన్ రూ.250 + జీఎస్‌టీ - మల్టీప్లెక్స్ లో రూ. 250 + జీఎస్‌టీ - రిక్లైనర్ రూ. 300 + జీఎస్‌టీ చెల్లించాల్సిందింగా తెలంగాణ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఇక ఏసీ థియేటర్ లో టికెట్ నిర్వాహణ రుసుము రూ.5 - నాన్ ఏసీ థియేటర్ లో రూ.3 ఉండాలని తెలిపింది.
ఈ మేరకు తెలంగాణలో అన్ని జిల్లాల కలెక్టర్‌లకు - థియేటర్ లైసెన్స్ దారులకు - పోలీస్ కమీషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కమిటీ నివేదికను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తుది అంగీకారం తెలిపే ముందు కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనుంది. త్వరలోనే కొత్త టికెట్ ధరలు పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వల్ల నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్లకు భారీ ఉపశమనం లభించనుంది.