Begin typing your search above and press return to search.

బుక్ మై షోబ్యాన్..న‌యా దోపిడిపై నైజాం క‌న్నెర్ర‌!

By:  Tupaki Desk   |   20 Feb 2022 4:43 AM GMT
బుక్ మై షోబ్యాన్..న‌యా దోపిడిపై నైజాం క‌న్నెర్ర‌!
X
ప్ర‌ముఖ అన్ లైన్ ఎంటర్ టైన్ మెంట్ బుకింగ్ ఎజెన్సీ `బుక్ మై షో`పై బిగ్ పంచ్ పండింది. స‌రిగ్గా అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ స‌మ‌యం స‌మీపిస్తున్న స‌మ‌యం చూసి గ‌ట్టి షాక్ త‌గిలింది. కొన్నేళ్ల పాటు యథేశ్చ‌గా దోపిడికి పాల్ప‌డిన బుక్ మై షో వేగానికి క‌ళ్లెం ప‌డింది. స‌రిగ్గా అదును చూసి నైజాం పంపిణీదారులు బుక్ మై షోపై క‌న్నెర్ర జేసారు.

బుక్ మై షోని బ్యాన్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఉన్న‌ట్లుండి బుక్ మై షోకి ఇలాంటి షాక్ ఎందుకు త‌గిలిన‌ట్లు? అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. నివేదిక‌ల ప్ర‌కారం బుక్ మై షో అస‌హ‌జ రీతిలో టిక్కెట్ల‌ను విక్ర‌యిస్తోంద‌ని..ఆ కారణంగానే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించార‌ని చాలా కాలంగా ఆరోప‌ణ‌లొస్తున్నాయి.

అయితే ఈ వ్య‌వ‌హారాన్ని ఇన్నాళ్లు చూసి చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఎట్ట‌కేల‌కు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ సీరియ‌స్ అయింది. టిక్కెట్ ధ‌ర‌లు తేల్చే వ‌ర‌కూ బుక్ మై షోని బ్యాన్ చేయాల‌ని నైజాం డిస్ర్టిబ్యూట‌ర్ల‌కు ప‌రిశ్ర‌మ‌ త‌రుపున లేఖ అంద‌డంతో పంపిణీదారులు బుక్ మై షోని బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

టిక్కెట్ ధ‌ర‌లు తేలే వ‌ర‌కూ కేవ‌లం టిక్కెట్ల‌ను థియేట‌ర్ లోని కౌంట‌ర్ వ‌ద్ద‌నే విక్ర‌యించాల‌ని ప‌రిశ్ర‌మ త‌రుపున‌...నైజాం పంపిణీదారులు త‌రుపున ఆదేశాలు జారీ అయ్యాయి. బుక్ మై షోలో టిక్కెట్ ధ‌ర‌లు అధికంగా ఉండ‌టం వ‌ల్లే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు దూరంగా ఉన్న‌ట్లు సందేహిస్తున్నారు. ఇదే విష‌యాన్ని `భీమ్లా నాయ‌క్` నైజాం పంపిణిదారుడు కూడా దృవీక‌రించారు.

బుక్ మై షో అడ్డ‌గోలు దోడిపి వ‌ల‌నే ఎంట‌ర్ టైన్ మెంట్ సాధార‌ణ ప్రేక్ష‌కుడికి థియేట‌ర్లో దూర‌మ‌వుతుంద‌ని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసారు. ఆ కార‌ణంగా నైజాం నుంచి బుక్ మైషోని బ్యాన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బుక్ మైషో నుంచి ఒక్కో టిక్కెట్ కు క‌నీసం 30 రూపాయ‌లు అద‌నంగా వ‌సూలు చేస్తున్నారు.

వీట‌న్నింటి లెక్క తేలాలంటే బ్యాన్ ఒక్క‌టే మార్గ‌మ‌ని నిర్ణ‌యించి ముందుకు వెళ్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యాన్ బుక్ మై షోకి కోలుకోలేని దెబ్బ‌గా చెప్పొచ్చు. ఈనెల 24 నుంచి అగ్ర హీరోలు చిత్రాలు రిలీజ కి రెడీ అవుతున్నాయి.

24న `వ‌లిమై` త‌మిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. ఇది పూర్తిగా మ‌ల్టీప్లెక్స్ ఆడియ‌న్స్ మూవీ. మెజార్టీ బుకింగ్స్ అన్ని ఆన్ లైన్ లో జ‌రుగుతాయి. కాబ‌ట్టి బుక్ మైషో బ్యాన్ ప్ర‌భావం ఈ సినిమా పై ఎక్కువ‌గానే ఉంటుంది.

ఇక 25న ` భీమ్లా నాయ‌క్` తో పాటు రానున్న రోజుల్లో `ఆర్ ఆర్ ఆర్` ..`రాధేశ్యామ్` లాంటి పాన్ ఇండియా చిత్రాలు స‌హా చాలా సినిమాలు స‌మ్మ‌ర్ కానుక‌గా వ‌రుస‌లో ఉన్నాయి.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో బుక్ మై షో బ్యాన్ తో స‌దరు పోర్ట‌ల్ ఇబ్బందుల్లో ప‌డింది. మ‌రి ఈ స‌మ‌స్య‌ల‌ను బుక్ మౌ షో వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంటుంది. లేదంటే భారీ మొత్తంలో న‌ష్టాలు త‌ప్ప‌వు.

అయితే ఈ బ్యాన్ ప్ర‌భావం సినిమా వ‌సూళ్ల‌పైనా ఉంటుంది. మెజార్టీ బుకింగ్స్ అన్ని ఇప్పుడు బుక్ మై షోలోనే జ‌రుగుతున్నాయి. థియేట‌ర్ కి వెళ్లి టిక్కెట్ కొనే ప‌రిస్థితులు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.

మెట్రో పాలిట‌న్ న‌గ‌రాలు నుంచి మున్సిపాలిటీల వ‌ర‌కూ బుక్ మైషో లోనే బుకింగ్స్ ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఆ ర‌కంగా సినిమా వ‌సూళ్ల‌పై ప్ర‌భావం స్ప‌ష్టంగా ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌ల కేవ‌లం నైజాం నుంచే ఉత్ప‌న్నం అయింది.

మిగ‌తా ఏరియాల‌కు సంబంధించి బుక్ మై షో వ‌ర్కింగ్ యధావిధిగా కొన‌సాగుతుంది. ఏపీలో ప్ర‌భుత్వమే నేరుగా ఓ ఆన్ లైన్ పోర్ట‌ల్ ని ఏర్పాటు చేసి విక్ర‌యాల‌కు సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణలో కూడా తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర‌ణ‌యాలు వైపు అడుగులు వేస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిన అంశం.