Begin typing your search above and press return to search.
బుక్ మై షో బంద్! జనం క్యూలో కొట్టుకుంటేనే కిక్కా?
By: Tupaki Desk | 20 Feb 2022 10:39 AM GMTఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి .. నందమూరి బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్ల క్యూలో తొక్కిసలాట జరిగేది. గొడవలు అల్లర్లు కొట్లాటలు చాలా సహజంగా కనిపించేవి. జనం క్యూలైన్ లో బారులు తీరేవారు. నాలుగైదు లైన్లు చాలక.. రోడ్డు మీద వరకూ క్యూ కట్టేసే సన్నివేశం ఉండడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగేది. అయితే దీనివల్ల సదరు హీరోల ఇమేజ్ బయటి ప్రపంచానికి తెలిసొచ్చేది.
కానీ ఇటీవల అలా లేదు.. థియేటర్ క్యూ లైన్ లో నించుని టికెట్లు కొనుక్కోవాల్సిన గత్యంతరం ఏం లేదు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మహిమ. ఆన్ లైన్ యూజర్ ఛార్జీలు అదనంగా బాదేస్తున్నా కానీ టికెట్ ని ఈజీగా బుక్ చేసుకోగలుగుతున్నారు.
సీటు కన్ఫామ్ అయ్యాకే ఇండ్ల నుంచి ఫ్యామిలీస్ తాపీగా థియేటర్లకు బయల్దేరుతున్నాయి. బుక్ మై షో.. పేటీఎం వంటి వేదికలపై టికెట్లు బుక్ చేసుకోవడం కూడా సులువుగానే ఉంది.
అయితే ఇప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ ముందు నైజాంలో డిస్ట్రిబ్యూటర్లు బుక్ మై షోని రద్దు నిర్ణయం తీసుకోవడంతో ఊహించని సమస్య ఎదురవుతోంది. జనం థియేటర్ల ముందు బారులు తీరాల్సిన సన్నివేశం నెలకొంది. అసలే మాస్ హీరో పవన్ కల్యాణ్ కి నైజాంలో ఫ్యాన్స్ చాలా ఎక్కువ. టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యూజర్ ఛార్జీలు.. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు అంటూ అదనంగా భారీ మొత్తాల్ని ఆన్ లైన్ టికెటింగ్ లో గుంజేస్తున్న మాట వాస్తవం. దానిని అదుపు చేసేందుకు సరిగ్గా పెద్ద సినిమా రిలీజ్ ముందు ఇలాంటి కుట్ర చేస్తారా? అంటూ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ముందే బుక్ మై షోతో మాట్లాడి ఉంటే వాళ్లు తగ్గించుకునేందుకు ఆస్కారం ఉండేది.
ఇలా సడెన్ నిర్ణయం తీసుకుంటారా సినీపెద్దలు? అంటూ నిలదీస్తున్నారు. ఆన్ లైన్ లో అదనపు బాదుడును మించి ఇప్పుడు ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. క్యూ లైన్ లో నించోవడం అంత ఇబ్బంది ఇక ఏదీ ఉండదు! అంటూ తిట్టేస్తున్నారు.
ఇంతకుముందు వకీల్ సాబ్ సమయంలో ఏపీలో టికెట్ ధరల్ని తగ్గించి దెబ్బ కొట్టారు. ఇప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలో బుక్ మై షో గేమ్ ఆడుతున్నారు. ఓవరాల్ గా అటు ఏపీలో టికెట్ రేట్ల తిప్పలు.. ఇటు ఆన్ లైన్ టికెటింగ్ తిప్పలు పవన్ సినిమాకి పెద్ద తలనొప్పిగా మారాయని విశ్లేషిస్తున్నారు.
అయితే ఎందరు నిలువరించాలని ప్రయత్నించినా పవన్ కల్యాణ్ మానియా ముందు ఏదీ నిలవదని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమాకి భారీ బిజినెస్ సాగింది.
అందుకు తగ్గట్టే ఆరంభ వసూళ్లను పవన్ కొల్లగొడతాడని భావిస్తున్నారు. పవన్ - రానా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు. సితార సంస్థ నిర్మించింది.