Begin typing your search above and press return to search.
సమంత చీర వెనక అంత కథ ఉందా
By: Tupaki Desk | 30 March 2017 12:37 PM GMTతాజాగా జరుగుతున్న ఐఫా ఉత్సవంలో సమంత స్టైలింగ్ పెద్దగా ఎవరికీ నచ్చలేదు. చేనేత వస్త్రాల్లో ఆకట్టుకునే కట్టుబొట్టుతోనే సమంత హాజరైంది కానీ.. అందరు భామలు అందాలతో మెరిసిపోతే.. స్యామ్ మాత్రం చేనేత దుస్తుల్లో కనిపించింది. సమంతను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసిన తర్వాత.. ఆమె తెగ యాక్టివ్ గా ప్రచారం చేసేస్తుడడం చూశాం.
అలాగే చేనేత కార్మికుల దగ్గరకు తనే వెళ్లిపోయి ఆదుకునేందుకు ప్రయత్నిస్తానని చెబుతోంది. అలాగే హ్యాండ్ లూమ్స్ కి ప్రచారం కల్పించేందుకే.. తాజా ఐఫా వేడుకకు చేనేత దుస్తుల్లో హాజరైంది. కానీ సమంత కట్టుకొచ్చిన చీర వెనక చాలానే కథ ఉంది. తెలంగాణను ప్రతిబింబించేలా ఈ చీర డిజైన్ చేశారు. తెలంగాణ అధికార చిహ్నాలు అన్నిటినీ ఈ చీర డిజైన్ లో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్ర అధికార జంతువు జింక - రాష్ట్ర పక్షి పాలపిట్ట - అధికార పుష్పం తంగేడు పువ్వు, రాష్ట్ర వృక్షం జమ్మిచెట్టు.. ఇలా అన్నిటినీ చీరపై చూపించేలా డిజైన్ చేశారు.
వీటితో పాటు దక్షిణాది మొత్తం అవార్డుల వేడుకను తెలంగాణ రాజధాని హైద్రాబాద్ లోనే నిర్వహించడంతో.. తాను చేనేతకు ప్రచారం కల్పించేందుకు ఇంతకంటే మంచి వేదిక ఉండదనే ఉద్దేశ్యంతోనే.. సమంత ఇలా తెలంగాణ హ్యాండ్ లూమ్స్ ను ధరించి హాజరైంది. అదీ సమంత చీరకట్టు వెనక కథ ప్లస్ కమింట్మెంట్.. ఎనీ మోర్ డౌట్స్ కామెంట్స్?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/