Begin typing your search above and press return to search.

తెలంగాణ MAA- ఏపీ MAA అంటూ విడ‌దీస్తారా?

By:  Tupaki Desk   |   29 Jun 2021 8:30 AM GMT
తెలంగాణ MAA- ఏపీ MAA అంటూ విడ‌దీస్తారా?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో ఆరుగురు స‌భ్యులు ఇప్ప‌టికే అధ్య‌క్ష ప‌ద‌వి కోసం క‌న్నేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌కాష్ రాజ్ - మంచు విష్ణు మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెల‌కొన‌నుంద‌ని అంచ‌నా. జీవిత‌-హేమ‌ల తో పాటు సీవీఎల్ న‌ర‌సింహారావు అనే తెలంగాణ సీనియ‌ర్ న‌టుడు కూడా పోటీప‌డుతున్నారు.

సీవీఎల్ ఒక న్యాయ‌వాది కం న‌టుడు. అలాగే భాజ‌పా పార్టీ త‌ర‌పున ప‌ని చేస్తున్నారు. హిందూత్వ వాదాన్ని ఆయ‌న తెర‌పైకి తెస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. ప్ర‌కాష్ రాజ్ భాజపా వ్య‌తిరేకి కాబ‌ట్టి అత‌డిని ఆయ‌న నిల‌దీస్తున్న వైనం వింత గొలుపుతోందంటూ టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ క‌ళాకారుల‌కు న్యాయం అంటూనే ప్ర‌కాష్ రాజ్ ను టార్గెట్ చేస్తున్నారు సీవీఎల్. తాజాగా ఓ చానెల్ డిబేట్ లో సీవీఎల్ ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌లు చేశారు. అత‌డి మాట‌ల్ని బ‌ట్టి మా ఎన్నిక‌ల్లో భాజ‌పా వ్య‌క్తులేమిటో అర్థం కాని వ్య‌వ‌హారంగా మారింది. తెలంగాణ వాదం.. ప‌రాయి వాదం.. హిందూత్వ వాదం ఇలా అన్నిటినీ మా ఎన్నిక‌ల్లోకి దించేశారు.

ఇక ఏపీ - మా అసోసియేష‌న్.. తెలంగాణ - మా అసోసియేష‌న్ అంటూ రెండుగా విడ‌దీయాల‌న్న‌ది సీవీఎల్ ప్ర‌ధాన డిమాండ్. దానివ‌ల్ల తెలంగాణ క‌ళాకారుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని వాదిస్తున్నారు. నిజానికి ఇలా రెండు వ‌ర్గాలు డివైడ్ చేయాల్సిన అవ‌స‌రం ఏం ఉంది? ఆయ‌నే ఒక అసోసియేష‌న్ కొత్త‌ది పెట్టుకోచ్చు క‌దా! అన్న వాద‌నా తాజాగా తెర‌పైకొచ్చింది. ప్ర‌కాష్ రాజ్ భాజ‌పా వ్య‌తిరేకి.. హిందూ వ్య‌తిరేకి అని ఆయ‌న కూడా వాదించ‌డం చూస్తుంటే మా ఎన్నిక‌ల రాజ‌కీయాలు మ‌రీ దిగ‌జారాయ‌న్న టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది. ఇక సీక్రెట్ బ్యాలెట్ అయితేనే తాను గెలుస్తాన‌ని అంగీక‌రించిన సీవీఎల్... తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకున్నారు కాబ‌ట్టి ఆయ‌న‌కు అయినా మునుముందు ఛాన్సులొస్తాయా లేదా? అన్న‌దే డౌట్ అంటూ గుస‌గుస‌లు మొద‌లైపోయాయి.